The Brain: చిత్తూరులో శరవేగంగా 'ది బ్రెయిన్' షూటింగ్
ABN , Publish Date - Nov 02 , 2025 | 06:02 PM
సస్పెన్స్, క్రైమ్ కథలకు మార్కెట్ బావుంటుంది. ప్రేక్షకుల ఆదరణ అలాగే ఉంటుంది. తాజాగా ఈ తరహా కథతో 'ది బ్రెయిన్’ చిత్రం తెరకెక్కుతోంది.
సస్పెన్స్, క్రైమ్ కథలకు మార్కెట్ బావుంటుంది. ప్రేక్షకుల ఆదరణ అలాగే ఉంటుంది. తాజాగా ఈ తరహా కథతో 'ది బ్రెయిన్’ చిత్రం తెరకెక్కుతోంది. అశ్విన్ కామరాజ్ కొప్పాల దర్శకుడు. అజయ్, తన్విక, బేబీ దాన్విత, అజయ్ ఘోష్, శరత్ లోహిత్ కీలక పాత్రదారులు. చిత్తూరు జిల్లా పరిసర ప్రాంతాలలో శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది.
దర్శకుడు అశ్విన్ కామరాజ్ కొప్పాల మాట్లాడుతూ ‘ది బ్రెయిన్’ చిత్రాన్ని క్రైమ్ అండ్ సస్పెన్స్ జానర్‌లో తెరకెక్కిస్తున్నాం. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఈ మూవీని తీస్తున్నాం. ఈ చిత్రానికి మాటలు పోతు గడ్డం ఉమా శంకర్ గారు అందించారు. యూఎస్ విజయ్ కెమెరామెన్‌గా, ఎంఎల్ రాజా మ్యూజిక్ డైరెక్టర్‌గా మంచి అవుట్ పుట్ అందిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాల్ని పూర్తి చేసుకుని విడుదల తేదీని ప్రకటిస్తాం' అని అన్నారు.