Sai Pallavi: MS. సుబ్బలక్ష్మీ బయోపిక్‌లో సాయి పల్లవి.. ట్రోల్ అవ్వక తప్పదా

ABN , Publish Date - Dec 15 , 2025 | 01:25 PM

ఇండస్ట్రీలో బయోపిక్ ట్రెండ్ పాత పడిపోయిన విషయం తెల్సిందే. ఒకప్పుడు సీనియర్ హీరోస్, హీరోయిన్స్, స్టార్ క్రికెటర్స్ జీవిత కథలను ఆధారంగా చేసుకొని సినిమాలు చేసి మంచి విజయాలను అందుకున్నారు మేకర్స్.

Sai Pallavi

Sai Pallavi: ఇండస్ట్రీలో బయోపిక్ ట్రెండ్ పాతపడిపోయిన విషయం తెల్సిందే. ఒకప్పుడు సీనియర్ హీరోస్, హీరోయిన్స్, స్టార్ క్రికెటర్స్ జీవిత కథలను ఆధారంగా చేసుకొని సినిమాలు చేసి మంచి విజయాలను అందుకున్నారు మేకర్స్. ఆ తరువాత చాలావరకు బయోపిక్ ట్రెండ్ తగ్గింది. అయితే తాజాగా ఒక బయోపిక్ ని తెరకెక్కించే పనిలో పడ్డారు గీతా ఆర్ట్స్ (Geetha Arts). చిన్న చిన్న సినిమాలను ఎంకరేజ్ చేస్తూ.. తమ బ్యానర్ లో రిలీజ్ చేస్తూ తమకంటూ ఒక గుర్తింపును సంపాదించుకున్నాడు అల్లు అరవింద్ (Allu Aravind). ప్రస్తుతం లెజెండరీ సింగర్ MS. సుబ్బలక్ష్మీ (MS Subbalakshmi) బయోపిక్ ను తెరకెక్కించడానికి ఆయన రంగం సిద్ధం చేస్తున్నాడని టాక్ నడుస్తోంది.

MS. సుబ్బలక్ష్మీ.. ఈ పేరు తెలియని సంగీత అభిమానులు లేరు అంటే అతిశయోక్తి కాదు. భారతదేశ అత్యున్నత పౌరపురస్కారమైన భారతరత్న పురస్కారాన్ని పొందిన మొట్టమొదటి సంగీత కళాకారిణిగా రికార్డ్ సృష్టించింది. సుబ్బలక్ష్మి తలలో మల్లెపూలు, చేతిలో తంబూర పట్టుకొని కచేరీ ప్రారంభించగానే శ్రోతలు ఆమె నలహరిలో మునిగిపోయేవారట. కర్ణాటక సంగీతంలో ఆమె గాత్రానికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. ఎన్నో వేల పాటలను ఆలపించిన ఆమె తన 88 వ ఏట 2004 లో మరణించింది. ఆమె లేకపోయినా.. ఆమె గొంతును మర్చిపోవడం ఎవరి తరం కాదు.

ఇక అలాంటి సంగీత విధ్వంసురాలి జీవితం గురించి ప్రేక్షకులకు తెలియాలని అల్లు అరవింద్ ఆమె బయోపిక్ ను తెరకెక్కించాలని చూస్తున్నాడు. ఇక ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. మళ్లీ రావా సినిమాతో తెలుగుతెరకు పరిచయమై మంచి విజయాన్ని అందుకున్న గౌతమ్ .. జెర్సీ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారాడు. ఇక ఈ ఏడాది కింగ్డమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి పరాజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం గౌతమ్ ఈ బయోపిక్ మీదనే వర్క్ చేస్తున్నట్లు సమాచారం. ఇక డైరెక్టర్, నిర్మాత సెట్ అయ్యారు.. సుబ్బలక్ష్మీ అమ్మగా ఎవరు కనిపించబోతున్నారు అంటే.. ముందు నుంచి చాలా పేర్లు వినిపించాయి.. నిత్యా మీనన్, శ్రద్దా కపూర్.. ఇలా చివరకు సాయిపల్లవిని ఎంపిక చేశారని అంటున్నారు.

సాయిపల్లవి ప్రస్తుతం హిందీలో రామాయణం సినిమాలో సీతగా నటిస్తుంది. ఆమె అయితే అమ్మ పాత్రకు సరిగ్గా సూట్ అవుతుందని అల్లు అరవింద్.. ఆమెను సెలెక్ట్ చేసి ఉంటాడు అని అంటున్నారు. అయితే కొంతమంది మాత్రం సాయిపల్లవి అస్సలు సెట్ అవ్వదు అని చెప్పుకొస్తున్నారు. ఆమె గతంలో దేవుడి గురించి, భక్తి గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు వైరల్ గా మరీనా విషయం తెల్సిందే. దాన్ని మనసులో పెట్టుకున్న కొంతమంది. ఆమె ఎప్పుడు దేవుడిని ఆమోదించదు, భక్తిభావం ఉండదు. అలాంటి ఆమె.. అలాంటి లెజెండరీ సింగర్ చూపిన భక్తిని చూపగలదా అని చెప్పుకొస్తున్నారు. ఇంకొందరు ఆమె వయస్సు ఎక్కడ.. ఈమె వయస్సు ఎక్కడ.. 88 ఏళ్ల వయసున్న అమ్మ పాత్రలో 30 ఏళ్ల అమ్మాయిని చూపిస్తే సెట్ అవుతుందా.. ? నడివయస్సులో ఉన్న నటీమణులు దొరకలేదా.. ? అని చెప్పుకొస్తున్నారు. మరికొందరు కచ్చితంగా ఈ సినిమా ఒప్పుకుంటే సాయిపల్లవి ట్రోల్ అవుతుంది అని అంటున్నారు. మరి ఇందులో ఏది నిజమవుతుందో.. అసలు సాయిపల్లవి ఈ బయోపిక్ కు ఒప్పుకుందో లేదో తెలియాల్సి ఉంది.

Updated Date - Dec 15 , 2025 | 03:04 PM