ప్రతి పోలీస్ గర్వించేలా ఉంటుంది
ABN , Publish Date - Jul 10 , 2025 | 06:04 AM
‘వాణిజ్య హంగులతో పాటు మంచి సందేశంతో రూపొందిన చిత్రం ‘ది 100’. సమాజానికి ఏదైనా మంచి సందేశం ఇవ్వాలనే ఆలోచనతో పెట్టిన టైటిల్ ఇది. ఈ సినిమాకు...
‘వాణిజ్య హంగులతో పాటు మంచి సందేశంతో రూపొందిన చిత్రం ‘ది 100’. సమాజానికి ఏదైనా మంచి సందేశం ఇవ్వాలనే ఆలోచనతో పెట్టిన టైటిల్ ఇది. ఈ సినిమాకు సీక్వెల్ చేసే ఆలోచన కూడా ఉంది’ అని ఆర్‌కే సాగర్ అన్నారు. ఆయన హీరోగా రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహించిన చిత్రమిది. రమేశ్ కే, వెంకీ పీ నిర్మించారు. ఈ శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఆర్‌కే సాగర్ సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు. ‘ఈ చిత్రంలో నాది పోలీస్ పాత్ర. ప్రతి పోలీస్ గర్వించేలా ఉంటుంది. మొగలి రేకులు సీరియల్‌లో చేసిన ఆర్‌కే నాయుడు పాత్ర బాగా గుర్తింపు తెచ్చింది. కానీ సినిమాల్లో మాత్రం దానికి భిన్నమైన పాత్రలు చేస్తూ వచ్చాను. మళ్లీ ఇన్నాళ్లకు బలమైన కథ కుదరడంతో ‘ది 100’ సినిమాలో పోలీస్ పాత్ర చేశాను. నిజజీవిత సంఘటనల ఆధారంగా రూపుదిద్దుకున్న కథ ఇది. కుటుంబం అంతా కలసి చూసేలా మా సినిమా ఉంటుంది’ అని చెప్పారు.