Tharun x Don Lee: డాన్ లీతో.. త‌రుణ్ ఫోటో వైరల్‌! సోష‌ల్‌ మీడియాలో ర‌చ్చ‌ర‌చ్చ‌

ABN , Publish Date - Jul 02 , 2025 | 07:38 AM

ద‌శాబ్దం క్రితం టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగిన త‌రుణ్ తాజాగా సౌత్ కొరియ‌న్ స్టార్‌తో దిగిన ఫొటో పెద్ద హంగామా సృష్టిస్తోంది.

Tharun

ఒక‌నాటి చైల్డ్ ఆర్టిస్ట్ ఆపై హీరోగా బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌తో టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగిన త‌రుణ్ (Tharun) సుమారు ద‌శాబ్దంగా సినిమాల్లో క‌నిపించ‌డం పూర్తిగా బంద్ చేశారు. కానీ త‌రుచూ ఎక్క‌డో అక్క‌డ వార్త‌ల్లో వినిపిస్తూ, క‌నిపిస్తూ త‌న అభిమానుల‌ను ప‌ల‌క‌రిస్తూ వ‌స్తున్నాడు. టాలీవుడ్‌లో జ‌రిగే ఈవెంట్ల‌కు సైతం హ‌జ‌ర‌వుతున్నారు. అయితే తాజాగా త‌రుణ్ సోష‌ల్ మీడియాలో పెట్టిన ఫొటోతో సోష‌ల్ మీడియా షేక్ అవుతోంది.

ఇటీవ‌ల అమెరికా (USA) ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన త‌రుణ్ లాస్ వేగాస్ (Las Vegas)లో సౌత్ కొరియా (South Korea) అగ్ర‌ న‌టుడు డాన్ లీ (DonLee)ని క‌లిసి ఆయ‌న‌తో ఫొటో దిగారు. ఆ చిత్రం కాస‌త్ సామాజిక మాద్య‌మాల్లోకి చేరి ఇప్పుడుపెద్ద ర‌చ్చే చేస్తుంది. ఆ ఫొటో చూసిన వాళ్లంతా షేర్ చేస్తూ పెద్ద‌ హంగామే సృష్టిస్తున్నారు. మిమ్మ‌లి్న ఇలా చూడ‌డం హ్యాపీగా ఉంద‌ని, మ‌ళ్లీ సినిమాలు చేయాల‌ని కామెంట్లు పెడుతున్నారు.

tarun

ఇదిలాఉంటే.. డాన్లీ ఇప్ప‌టికే అనేక కొరియ‌న్ సినిమాల‌తో ఇండియ‌న్ ముఖ్యంగా తెలుగు ప్రేక్ష‌కుల‌కు చేరువ‌య్యాడు. ఆయ‌న న‌టించిన సినిమాలు అనేకం ఓటీటీలో మంచి ఆద‌రణ‌న‌ను ద‌క్కించుకున్నాయి. ఈ నేప‌థ్యంలో అర్జున్ రెడ్డి, క‌బీర్ సింగ్‌, యానిమ‌ల్ చిత్రాల ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా (Sandeepreddy vanga) త‌దుప‌రి ప్ర‌భాస్ (Prabhas‌)తో తెర‌కెక్కించ‌నున్న స్పిరిట్ (Spirit) సినిమాలో డాన్‌లీని కీల‌క పాత్ర‌కు తీసుకుంటున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇంకా ఈ విష‌యం అధికారికంగా ప్ర‌క‌టించ‌క‌పోయినా ఫ్యాన్స్ అంతా ఫిక్స్ అయిపోయారు. ఆక్ర‌మంలో త‌రుణ్ డాన్ లీతో దిగిన ఫొటో బ‌య‌ట‌కు రావ‌డంతో మ‌రోసారి స్పిరిట్ సైతం వైర‌ల్ అవుతుంది

Updated Date - Jul 02 , 2025 | 07:38 AM