Nithiin: మంచి కథలతోనే వస్తా.. ఎవరిని నిరాశపరచను
ABN , Publish Date - Jul 01 , 2025 | 01:05 PM
నా గత సినిమాలు ప్రేక్షకుల్ని, నన్ను అభిమానించే వారిని ఎంతో నిరాశపర్చాయి. ఇక నుంచి మంచి స్క్రిప్ట్స్ తో మీ ముందుకు వస్తానని ప్రామిస్ చేస్తున్నా.
"నా గత సినిమాలు ప్రేక్షకుల్ని, నన్ను అభిమానించే వారిని ఎంతో నిరాశపర్చాయి. ఇక నుంచి మంచి స్క్రిప్ట్స్ తో మీ ముందుకు వస్తానని ప్రామిస్ చేస్తున్నా. ఈ సినిమా తప్ప కుండా నాకు మంచి హిట్ ఇస్తుంది" అని నితిన్ అన్నారు. అయన హీరోగా దిల్ రాజు, శిరీష్ నిర్మించిన చిత్రం 'తమ్ముడు'. శ్రీరామ్ వేణు దర్శకుడు. లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ నెల 4న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. సోమవారం రిలీజ్ ట్రైలర్ ను హైదరాబాద్ విడుదల చేశారు.
నితిన్ మాట్లాడుతూ "ఈ సినిమా శ్రీరామ్ వేణు గారి కోసం, నా సినిమాలను ఇష్టపడే అభిమానులు, నాకు సక్సెస్ రావాలని కోరుకునే వారి కోసం ఘన విజయం సాధించాలి. నా గత చిత్రాలు మీకు ఆనందాన్ని కలిగించలేదు. కానీ ఈ సినిమా తప్పకుండా సంతోష పెడుతుంది. ఈ చిత్రం కోసం శ్రీరామ్ వేణు ఎంత కష్టపడ్డాడో జూలై 4న మాట్లాడతాను. నా గత సినిమాలు నిరాశపర్చాయి. ఇక నుంచి మంచి స్క్రిప్ట్స్ తో మీ ముందుకు వస్తానని ప్రామిస్ చేస్తున్నా. ఈ సినిమా కోసం నా కో స్టార్స్ 80 డేస్ ఫారెస్ట్ లో షూటింగ్ చేశారు. జ్వరం వచ్చినా, ఫుడ్ పాయిజన్ అయినా, గాయాలు అయినా ఓర్చుకుని నటించారు. నేను కొంచెం దిగులుగా ఉంటే రాజు గారు శిరీష్ గారు నాకు బూస్ట్ ఇచ్చేలా మాట్లాడేవారు. ఇది థియేట్రికల్ గా మీకు మంచి ఎక్సిపీరియన్స్ ఇచ్చే సినిమా" అని అన్నారు.
అన్ కండీషనల్ గా సపోర్ట్ ఇచ్చాడు: శ్రీరామ్ వేణు
"నాకంటే తమ్ముడు కథను సినిమాను ఎక్కువ నమ్మింది శిరీష్. నేను ఎప్పుడైనా దిగాలుగా ఉంటే అన్నం ఉడికిందంటే ఒక మెతుకు చూస్తే చాలు ఈ సీన్ చాలు అద్భుతంగా చేశావ్ అంటూ ఎంకరేజ్ చేసేవారు. ఈ సినిమాను ఇలా థియేట్రికల్ ఎక్సిపీరియన్స్ కోసం డిజైన్ చేశానని చెప్పినప్పుడు ప్రొడ్యూసర్స్ గా ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. రాజుగారు, శిరీష్ గారు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాననే అనుకుంటున్నాను. ఈ సినిమా కోసం నితిన్ ప్రతి విషయంలో అన్ కండీషనల్ గా సపోర్ట్ చేశారు. నేను అనుకున్న క్యారెక్టర్ ను ఎంతో బాగా పర్ ఫార్మ్ చేశాడు. ఈ మూవీలో మీరు కొత్త లయ గారిని చూస్తారు. వర్ష నాకు కూతురు లాంటిది. ఈ సినిమా కోసం కిక్ బాక్సింగ్ నేర్చుకుంది. ఈ సినిమాలోని ఫ్యామిలీ ఫిల్లర్ లాంటిది. వాళ్ల మీదే ఎమోషన్ క్యారీ అవుతుంటుంది. డీవోపీలుగా చేసిన సేతు, సమీర్ రెడ్డి గారు, గుహన్ గారు బ్రిలియంట్ విజువల్స్ ఇచ్చారు. మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ సీన్స్ చూసి తను బాగా కనెక్ట్ అయ్యి బెటర్ మెంట్ కోసం రెండు సార్లు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు" అన్నారు.
ఆ సినిమాల తరహాలో హిట్: శిరీష్
"జూలై 4న సాధించబోయే సక్సెస్ క్రెడిట్ మొత్తం శ్రీరామ్ వేణుకే దక్కాలి. ఈ సినిమాకు మేము పడిన కష్టం తక్కువ. ఈ సినిమా సక్సెస్ దర్శకుడిదే అవుతుంది. ఇలాంటి వేదక మీదే మళ్లీ సెలబ్రేట్ చేసుకుందాం. నితిన్ కెరీర్ లో జయం, గుండెజారి గల్లంతయ్యిందే మూవీస్ సక్సెస్ కు ఎంత సంతోషపడ్డాడో, తమ్ముడు మూవీ విజయం అంతకు రెట్టింపు ఆనందాన్నిస్తుంది. నిర్మాతలుగా నితిన్ కు మాటిస్తున్నాం" అన్నారు.
ఇందులో వాళ్ళు కూడా హీరోలే: నిర్మాత దిల్ రాజు
"శ్రీరామ్ వేణు మాతో సుదీర్ఘ ప్రయాణం చేస్తున్నాడు. ఆయన ఏంటో మాకు పూర్తిగా తెలుసు. మా దగ్గర ఎంసీఏ, వకీల్ సాబ్ లాంటి సూపర్ హిట్స్ చేశాడు. ఆ మూవీస్ కు మా దగ్గర నుంచి ఏదైనా సపోర్ట్ తీసుకున్నాడేమో గానీ తమ్ముడు సినిమాకు మాత్రం తను సోలోగా కష్టపడ్డాడు. ఈ మూవీ సాధించబోయే సక్సెస్ క్రెడిట్ శ్రీరామ్ వేణుదే. ఇందులో నితిన్ తో పాటు ఐదుగురు ఉమెన్స్ లయ, సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ, స్వసిక, దిత్య..స్ట్రాంగ్ రోల్స్ చేశారు. వీళ్ల క్యారెక్టర్స్ ఎప్పటికీ గుర్తుంటాయి. నితిన్ తో పాటు వీళ్లు ఐదుగురినీ హీరోలుగా అనౌన్స్ చేయొచ్చు. అంత బాగా చేశారు. నితిన్ గత కొన్ని చిత్రాలు సక్సెస్ కాలేదని బాధలో ఉన్నాడు. కానీ "తమ్ముడు" ఆయనకు కమ్ బ్యాక్ మూవీ అవుతుంది. 'సంక్రాంతికి వస్తున్నాం' తర్వాత మా బ్యానర్ కు మరో హిట్ ఇచ్చే సినిమా ఇది. రామ్ చరణ్ తో గేమ్ ఛేంజర్ చేశాం. చరణ్ తో సూపర్ హిట్ చేయలేకపోయామనే లోటు ఉంది. త్వరలోనే రామ్ చరణ్ తో ఓ సూపర్ హిట్ మూవీ చేయబోతున్నాం. త్వరలో ఆ ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తాం" అన్నారు.
వర్ష బొల్లమ్మ మాట్లాడుతూ " ఈ పొట్టిపిల్ల ఏం చేస్తుందని అనుకోకుండా దర్శకుడు ఈ అవకాశం ఇచ్చారు. ఏ మేకప్ లేకుండా ఫ్లైట్ దిగి శ్రీరామ్ గారి ఆఫీస్ కు వెళ్లాను. నన్ను చూసి ఇలా ఓకే అని క్యారెక్టర్ కు సెలెక్ట్ చేశారు. నితిన్ తో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. లయ గారు స్వీట్ పర్సన్. ఆమె మాలాంటి ఎంతోమందికి ఇన్సిపిరేషన్. దిల్ రాజు గారు ఇటీవల దిల్ రాజు డ్రీమ్స్ అనే ప్లాట్ ఫామ్ అనౌన్స్ చేశారు. లక్షలాది మందికి ఆ ప్లాట్ ఫామ్ హోప్ ఇస్తుందని ఆశిస్తున్నా. మనం కొన్ని సినిమాలు థియేటర్స్ లో మిస్సయితే బాధపడతాం. ఆ సినిమాలను థియేటర్స్ లోనే ఎక్సిపీరియన్స్ చేయాలి. అలా థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయాల్సిన సినిమా ఇది" అన్నారు.
పదేళ్లైనా ఉండి చేయాల్సిన సినిమా ఇది: లయ
"ఈ మూవీ స్క్రిప్ట్ చెప్పినప్పుడు డిఫరెంట్ గా ఉందని అనుకున్నా. ఇలాంటి క్యారెక్టర్ నేను ఇప్పటిదాకా చేయలేదు. నా పర్సనల్ లైఫ్ లో కూడా ఇలాంటి ఎమోషన్స్ ఎక్సిపీరియన్స్ చేయలేదు. ఎందుకంటే మా ఇంట్లో నేను సింగిల్ చైల్డ్ ను. బ్రదర్స్, సిస్టర్స్ ఎవరూ లేరు. ఈ సినిమా కోసం 2 ఏళ్లు అయ్యింది అని అంటున్నారు. పదేళ్లు టైమ్ పట్టినా ఇలాంటి మంచి సినిమాకు పని చేస్తాం. నా గత చిత్రాలు చూసి నన్ను ప్రేక్షకులు ఎంతగా అభిమానించారో, అదే ప్రేమను "తమ్ముడు" మూవీ మీద చూపిస్తారని కోరుకుంటున్నా'' అన్నారు