Director Sriram Venu: కథలో భిన్న కోణాలుంటాయి
ABN , Publish Date - Jul 01 , 2025 | 04:46 AM
తమ్ముడు సినిమాలో కుటుంబ భావోద్వేగాలు, భిన్న కోణాలు ఉంటాయి. ట్రైలర్‌లో కథ ఎలా ఉండబోతుందో చెప్పాం అని అన్నారు దర్శకుడు శ్రీరామ్ వేణు. నితిన్ హీరోగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం తమ్ముడు. దిల్ రాజు, శిరీష్ నిర్మించారు.
- శ్రీరామ్ వేణు
‘‘తమ్ముడు’ సినిమాలో కుటుంబ భావోద్వేగాలు, భిన్న కోణాలు ఉంటాయి. ట్రైలర్‌లో కథ ఎలా ఉండబోతుందో చెప్పాం’ అని అన్నారు దర్శకుడు శ్రీరామ్ వేణు. నితిన్ హీరోగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘తమ్ముడు’. దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. ఈ శుక్రవారం థియేటర్లలో విడుదలవుతున్న సందర్భంగా శ్రీరామ్ వేణు మీడియాతో మాట్లాడుతూ ‘ఈ చిత్రానికి సెన్సార్ వాళ్లు కొన్ని కట్స్ చెప్పారు. మేము ఆ కట్స్ వద్దనుకున్నాం. సినిమాలో హీరోతోపాటు ఐదుగురు మహిళా క్యారెక్టర్లు బలంగా ఉంటాయి. ‘విక్రమ్’లో కమల్ హాసన్ పాత్ర కథలో ఎలా ట్రావెల్ అవుతుందో అలా ఈ చిత్రంలోనూ ఉంటుంది. ఆర్చరీని కథలో చేర్చాలని చాలా సార్లు అనుకున్నాం. ‘తమ్ముడు’లో కుదిరింది. ఆర్చరీ ట్రైనర్‌తో నితిన్‌కు 15 రోజులు శిక్షణ ఇప్పించాం. కథలో ప్రధానంగా బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్ ఉన్నా అనేక కోణాల్లో మూవీ సాగుతుంది. ‘కాంతారా’ చూశాక సప్తమి గౌడ మా మూవీలోని క్యారెక్టర్‌కు బాగుంటుందని అనిపించి తీసుకున్నాం. మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోకనాథ్ మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు.
ఓ దినపత్రికలో వచ్చిన ఆర్టికల్ స్ఫూర్తితో ‘తమ్ముడు’ కథను సిద్ధం చేసుకున్నా. కథ విని దిల్‌రాజు గారు బడ్జెట్ గురించి ఆలోచించకుండా నిర్మించారు. ఈ కథకు సరిపోయే హీరో కోసం వెతికాం. నితిన్ బాగుంటాడని తీసుకున్నాం. లయ పాత్ర కోసం ఒకప్పటి స్టార్ హీరోయిన్‌కి కథ చెప్పాం. ఆమెకు కథ, క్యారెక్టర్ నచ్చింది. కానీ ఆమె వ్యక్తిగత కారణాల వల్ల నటించలేదు. అయితే మరోసారి ఇలాంటి క్యారెక్టర్ వస్తే తప్పకుండా నటిస్తానని చెప్పారు. నా ప్రతి సినిమా ఒక కొత్త జానర్‌లో ఉంటుంది. నేనెప్పుడూ జానర్ రిపీట్ చేయలేదు. నా స్ర్కిప్ట్‌లో ఫిమేల్ క్యారెక్టర్లకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఇప్పటి దాకా అలా చేస్తూ వచ్చాను. తరవాత సినిమాకు ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేను’ అని అన్నారు.