Vachinavaadu Gautam: సినిమాలో వావ్ ఫ్యాక్టర్ ఉంది.. టీజర్ చాలా బావుంది
ABN, Publish Date - May 15 , 2025 | 06:50 PM
హిడింభా, శివం భజే వంటి డిఫరెంట్ చిత్రాలతో వస్తూ ప్రేక్షకులకు ఆకట్టుకుంటున్న హీరో అశ్విన్‌బాబు. తాజాగా ఆయన నటించిన చిత్రం వచ్చినవాడు గౌతమ్.
హిడింభా, శివం భజే వంటి డిఫరెంట్ చిత్రాలతో వస్తూ ప్రేక్షకులకు ఆకట్టుకుంటున్న హీరో అశ్విన్‌బాబు (Ashwin Babu). తాజాగా ఆయన నటించిన చిత్రం వచ్చినవాడు గౌతమ్ (Vachinavaadu Gautam). అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నెంబర్ 3గా రూపొందుతున్న ఈమెడికో థ్రిల్లర్‌గా చిత్రానికి మామిడాల ఎం .ఆర్. కృష్ణ (Mamidala M R Krishna) దర్శకత్వం వహిస్తుండగా టి. గణపతి రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రవల్లిక యోగి కో - ప్రొడ్యూసర్. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్‌కి మంచి రెస్పాన్స్ రాగా తాజాగా.. టీజర్ రిలీజ్ చేశారు హిట్ సిరీస్ చిత్రాల దర్శకుడు శైలేష్ కొలను, సంగీత దర్శకుడు తమన్ యుఖ్య అతిథులుగా హజరై టీజర్ విడుదల చేశారు.
'ధర్మం దారి తప్పినప్పుడు.. ఏ అవతారం రానప్పుడు.. వచ్చినవాడు గౌతమ్' అంటూ హీరో మనోజ్ మంచు పవర్‌ఫుల్ వాయిస్ ఓవర్‌తో మొదలైన టీజర్ అద్యంతం ఆకట్టుకునేలా ఉంది. గౌతమ్ పాత్రలో అశ్విన్ బాబు కనిపించిన తీరు పవర్‌ఫుల్, ఇంటెన్స్, మిస్టీరియస్ గా ఉంది. ఆయన బాడీ లాంగ్వేజ్, యాక్షన్ టైమింగ్ అన్నీ ఆడియన్స్‌ను థ్రిల్‌కు గురి చేసేలా ఉన్నాయి. రొటీన్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా కాకుండా, కొత్త కాన్సెప్ట్‌తో మూవీని రూపొందించినట్లు తెలుస్తోంది. గౌర హరి ( Gowra hari) అందించిన నేపథ్య సంగీతం టీజర్‌కు ఇంటెన్స్ ని ఇచ్చింది. మొత్తంగా టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది.
ఈ సందర్భంగా హీరో అశ్విన్ బాబు మాట్లాడుతూ.. టీజర్ అందరికీ నచ్చడం చాలా ఆనందంగా ఉంది. డైరెక్టర్ కృష్ణ కథ చెప్పగానే నాకు చాలా నచ్చింది. డెఫినెట్‌గా చాలా కొత్త పాయింట్.. మీరు ఊహించలేని విధంగా ఉండి మెస్మరైజ్ చేస్తుందని భావిస్తున్నా అన్నారు. మంచు మనోజ్ అన్నకి థాంక్యూ సో మచ్. ఆయన వాయిస్ టీజర్ కి ప్రాణం పోసి మరో స్థాయికి తీసుకెళ్ళింది. నిర్మాత గణపతి రెడ్డి గారి పేరు ఇండస్ట్రీలో చాలా గట్టిగా వినిపిస్తుంది. ఆయనతో ఈ సినిమా చేయడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలకు మించి ఉంటుంది. ఈ టీజర్ హిట్ డైరెక్టర్ శైలేష్ కోలను గారి చేతుల మీద లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. తమన్ అందరికీ మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు. నాకు మాత్రం తను ఒక ఎమోషన్. తను నాకు గాడ్ గిఫ్ట్. తను నా జీవితంలో ఉండడం వెరీ లక్కీ. మా టీజర్ ని సక్సెస్ చేసినందుకు అందరికీ థాంక్యూ'అన్నారు
మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుతూ.. అశ్విన్ నేను ప్రతిరోజు సాయంత్రం క్రికెట్ ఆడకపోతే ఆరోజు గడవదు. నిజానికి అశ్విన్ గ్రౌండ్ లోకి వస్తే నాకు చాలా అసలు నచ్చదు. తను బాదుడుకి బాలు పట్టుకుంటే చేతులు నొప్పి పుడతాయి( నవ్వుతూ) మేము ఎమోషనల్ గా చాలా బాండ్ అయ్యాం. తను పాజిటివ్ గా ఉంటాడు. ఈ సినిమా టీజర్ చాలాసార్లు చూశాను. హరీ గౌర హనుమాన్ తో చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ రోజుల్లో పేరు రావడం అంత ఈజీ కాదు. ఈ సినిమా కూడా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. తప్పకుండా ఈ సినిమా చాలా మంచి విజయం సాధిస్తుందని నమ్మకం ఉంది'అన్నారు డైరెక్టర్ శైలేష్ కొలను మాట్లాడుతూ.. టీజర్ కట్ చాలా బాగుంది. అశ్విన్ వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్. తనతో కలిసి వర్క్ చేయాలనే ఉంది. మెడికల్ థ్రిల్లర్ ఎప్పుడు కూడా గ్రేట్ కాంబినేషన్. ఈ కథ కూడా నాకు అలాగే అనిపిస్తుందన్నారు. డైరెక్టర్ కృష్ణ మాట్లాడుతూ.. టీజర్ ఇంత అద్భుతంగా రావడానికి కారణం హీరో అశ్విన్ బాబు. నన్ను నమ్మి ట్రావెల్ చేశారు. అలాగే డీవోపీ బాల్ రెడ్డి, మ్యూజిక్ హరి గౌర, మా టీం అంత అద్భుతమైన వర్క్ ఇచ్చారు అందుకే ఇంత మంచి టీజర్ వచ్చిందన్నారు
హీరోయిన్ రియా మాట్లాడుతూ..అందరికీ నమస్కారం. చాలా మంచి కాన్సెప్ట్ థ్రిల్లర్ ఉన్న సినిమా ఇది. నిర్మాత చాలా మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తో సినిమా తీశారు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ థాంక్ యూ. అశ్విన్ బెస్ట్ కో స్టార్. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది'అన్నారు. నిర్మాత గణపతి రెడ్డి మాట్లాడుతూ.. హిట్ దర్శకులు శైలేస్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారికి థాంక్ యూ. టీజర్ చూసిన తర్వాత గూస్బంప్స్ వచ్చాయి. అశ్విన్ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. దర్శకుడు కృష్ణ విజువల్స్ టేకింగ్ అదరగొట్టారు. హరి గారి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాని ఎక్కడా రాజీపడకుండా నిర్మించాం. చాలా మంచి టీంతో పని చేశాం. ఈ సినిమాకి మీ అందరి సపోర్ట్ కావాలని కోరుకుంటున్నా అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ హరి గౌర మాట్లాడుతూ.. టీజర్ సౌండ్ చాలా బావుందని అనే కాంప్లిమెంట్స్ రావడం చాలా ఆనందాన్ని ఇస్తోంది. తమన్ గారి బాటలోనూ నేను వెళ్తున్నాను. ఈ వేడుకకు ఆయన రావడం చాలా హ్యాపీగా ఉందన్నారు.