Shiva Jyothi: 'ది రిచెస్ట్ బిచ్చగాళ్లం'.. పొరపాటున ఆ మాటలొచ్చాయి! క్షమించండి
ABN , Publish Date - Nov 23 , 2025 | 05:46 AM
తిరుమలలో ప్రసాదంపై యాంకర్ శివజ్యోతి చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. భక్తుల విమర్శలపై ఆమె క్షమాపణలు చెప్పింది.
తిరుమల (Tirumala)లో ప్రసాదంపై యాంకర్ శివ జ్యోతి (Shiva Jyothi) చేసిన వ్యాఖ్యల పట్ల భక్తులు భగ్గు మంటున్నారు. ఇటీవల శ్రీవారి దర్శనానికి వచ్చిన ఆమె తన భర్త, స్నేహితుడితో కలిసిచేసిన ఒక వీడియో సోషల్ మీడి యాలో వైరల్ అవుతోంది. క్యూలైన్లో వెళ్తున్న సమయంలో టీటీడీ అందజే స్తున్న ప్రసాదాలపై...' ప్రసాదాన్ని అడు క్కుంటున్నామని, ఇలా ఎప్పుడూ అడుక్కో లేదని, ది రిచెస్ట్ బిచ్చగాళ్లమని' ఆమె నవ్వుతూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్ప దమయ్యాయి. పవిత్రమైన తిరుమల ప్రసాదం స్వీకరించడం అడుక్కోవ డమా అని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పొరపాటున ఆ మాటలొచ్చాయి.. సారీ: శివజ్యోతి
తిరుమలలో అన్నప్రసాదాల పై తాను చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన క్రమంలో శివజ్యోతి శనివారం రాత్రి స్పందిస్తూ ఓ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. నా మాటలు తప్పుగా ఉన్నాయి కానీ, నా ఉద్దేశం అదికాదు. రూ.10వేల టికెట్ కోసం కాఫీ లైన్లో నిలబడ్డామనే ఉద్దేశంతో అన్నాను. నా తరపున, నా తమ్ముడు సోను తరపున సారీ చెబుతున్నా.
నా జీవితాన్ని మార్చిన స్వామి గురించి తప్పుగా మాట్లాడను. ఆయన దయ లేకుంటే నా జీవితంలో ఏదీ జరిగేది కాదు. నా కడుపులోని బిడ్డ కూడా స్వామి ప్రసాదించిందే. తెలిసో తెలియకో పొరపాటున నా నుంచి, నా తమ్ముడు నోటి నుంచి ఆ మాటలు వచ్చాయి. భక్తులకు, టీటీడీ బోర్డు సభ్యులందరికి సారీ చెబుతున్నా మరోసారి ఇలా జరగదు' అంటూ వీడియో ద్వారా వివరణ ఇస్తూ క్షమాపణలు కోరారు.