Sampath Nandi: దర్శకుడు సంపత్ నంది.. ఇంట విషాదం
ABN , Publish Date - Nov 26 , 2025 | 09:30 AM
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంపత్ నంది (Sampath Nandi) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి నంది కిష్టయ్య (73) (Nandi Kishtaiah) గారు నిన్న రాత్రి కన్నుమూశారు.
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంపత్ నంది (Sampath Nandi) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి నంది కిష్టయ్య (73) (Nandi Kishtaiah) గారు నిన్న రాత్రి కన్నుమూశారు. సుదీర్ఘకాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న కిష్టయ్య గారి పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు.
విషయం తెలుసుకున్న శ్రేయోభిలాషులు, సన్నిహితులు సంపత్ నంది, ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలుపుతున్నారు. కిష్టయ్య అంత్యక్రియలు ఈ రోజు వారి స్వస్థలం ఓదెలలో జరగనున్నాయని కుటుంబ సభ్యులు వెల్లడించారు.
కాగా తండ్రి మరణంతో సంపత్ నంది తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా తన తండ్రిని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయి సోల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టు ఇప్పుడు వైరల్ అవుతుంది. దానిని చదివితే తండ్రీకొడుకులుగా వారిద్ధరి మధ్య బంధం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది.