Kamal Haasan: స్టార్‌గా నేను పుట్టిన ఇల్లు తెలుగు! నాయకుడిని మించి థగ్ లైఫ్

ABN , Publish Date - May 22 , 2025 | 09:59 PM

స్టార్‌గా నేను పుట్టిన ఇల్లు తెలుగు అని.. థగ్ లైఫ్ నాయకుడు కంటే బిగ్గర్ హిట్ అవుతుంది.. ఇది నా ప్రామిస్ అని కమల్ హాసన్ పేర్కొన్నారు.

kamal

సినీప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా థగ్ లైఫ్ (Thug life). కమల్ హాసన్ హీరోగా, లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో నాయ‌కుడు వంటి క‌ల్ట్ క్లాసిక్ చిత్రం త‌ర్వాత‌ తెరకెక్కుతున్న ఈ హై-ఓక్టేన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా జూన్ 5న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. త్రిష, శింబు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజ‌ర్‌, ట్రైల‌ర్, ఇత‌ర‌ ప్రమోషనల్ కంటెంట్ నేషనల్ వైడ్ గా సెన్సేషన క్రియేట్ చేసింది. గతంలో విక్రమ్, అమరన్ లాంటి బ్లాక్‌బస్టర్లు అందించిన ఎన్ సుధాకర్ రెడ్డి శ్రేష్ఠ్ మూవీస్ ద్వారా ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు. తాజాగా శుక్ర‌వారం హైద‌రాబాద్‌లో ఈ చిత్ర యూనిట్ మీడియా మీట్ నిర్వహించారు.

ఈ సంద‌ర్భంగా కమల్ హాసన్ (Kamal Haasan) మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఒక దర్శకుడిగా మణిరత్నం గారు నాయకుడు సినిమాతో ఎలా అయితే అందరినీ సర్ప్రైజ్ చేశారో.. థగ్ లైఫ్ తో కూడ ఆయన ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేయబోతున్నారు. నన్ను ద్రోణాచార్యతో పోల్చారు. కానీ నేను ద్రోణాచార్యుని కాదు. నేను ఇంకా విద్యార్థినే. ఒకరికి నేర్పాలంటే మన ముందు నేర్చుకోవాలి. నేను ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను. మీరు కూడా నాతో పాటు కలిసి నేర్చుకోండి. నేను మణిరత్నం గారి సినిమాలో యాక్ట్ చేయను, జస్ట్ బిహేవ్ చేస్తాను. మేమంతా సినిమా అభిమానులం. సినిమాని ఎప్పుడు కూడా భుజాలపై మోస్తాం. నాజర్ గారు ఆల్రౌండర్. మేము ఎప్పటినుంచో జర్నీ చేస్తున్నాం. ఇంద్రుడు చంద్రుడు సినిమాకి తనికెళ్ల భరణి గారు రాయాల్సింది. కానీ అది కుదరలేదు. ఆయనతో కలిసి మరింత ప్రయాణం చేయాలని ఉంది. ఆయన ఇంకా ఎక్కువ రాయాలని కోరుకుంటున్నాను అన్నారు.

శింబు చైల్డ్ వుడ్ నుంచి నేను తన సినిమాలు చూస్తూ ఉన్నాను. నేను కూడా చైల్డ్ యాక్టర్ నుంచి జర్నీ స్టార్ట్ చేశాను. అందుకే మేము ఎంతో కనెక్ట్ అయ్యాం. ఏదైనా సినిమానే మాకు నేర్పింది. నేను అందుకే ఒక సినిమా విద్యార్థిగానే నన్ను నేను చెప్పుకుంటాను. నేను మనసుపెట్టి చేసిన ప్రతి సినిమా గొప్ప విజయాన్ని సాధించింది. థగ్ లైఫ్ మనసుపెట్టి చేసిన సినిమా. అభిరామి మళ్ళీ సినిమాల్లో నటించడం ఆనందంగా ఉంది. ఇది ఒక ఫెంటాస్టిక్స్ టీం తో చేసిన సినిమా. గొప్పగా సెలబ్రేట్ చేసుకునే సినిమా ఇలాంటి సినిమా మళ్లీ మళ్లీ రాదు. అందుకే సినిమాని ప్రమోట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. ఈ సినిమా నాయకుడు కంటే పెద్ద విజయం సాధిస్తుంది. ఇది నా ప్రామిస్. ఈ సినిమా ఫస్ట్ డే షూటింగ్ అప్పటినుంచి చాలా ఎక్సైట్ మెంట్ ఉంది. ఇప్పటికే కంటిన్యూ అవుతుంది. నేను తెలుగులోనే స్టార్ గా ఎదిగాను. స్టార్ గా నేను పుట్టిన ఇల్లు తెలుగు. అందుకు తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు. జూన్ 5న సినిమా వస్తోంది. చాలా ప్రేమతో చేసిన సినిమా ఇది. సినిమా చూసిన తర్వాత మరింత గొప్పగా సెలబ్రేట్ చేసుకుందాం'అన్నారు.

Updated Date - May 22 , 2025 | 10:28 PM