Film Chamber: పూర్తయిన ఛాంబర్‌ ఎన్నికలు.. ఫలితాలు ఎప్పుడంటే..

ABN , Publish Date - Dec 28 , 2025 | 02:40 PM

తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఎన్నికల పోలింగ్‌ (Telugu Film chamber Election) పూర్తయింది. ఆదివారం ఉదయం ప్రారంభమైన పోలింగ్‌ మద్యాహ్నాం ఒంటి గంటకు వరకూ కొనసాగింది.

Telugu Film Chamber

తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఎన్నికల పోలింగ్‌ (Telugu Film chamber Election) పూర్తయింది. ఆదివారం ఉదయం ప్రారంభమైన పోలింగ్‌ మద్యాహ్నాం ఒంటి గంటకు వరకూ కొనసాగింది. సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి.  మన ప్యానల్‌ (Mana pannel) పేరిట చిన్న నిర్మాతలు, ప్రొగ్రెసివ్‌ ప్యానల్‌ (progrssive pannel) పేరుతో పెద్ద నిర్మాతలు పోటీ పడ్డారు. అధ్యక్ష, కార్యదర్శులతోపాటు 12 మంది ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యులను ఎన్నుకోనున్నారు.  

ఛాంబర్‌లో 3,355 మంది సభ్యులున్నారు. 3287 మందికి ఓటు వేసే అర్హత ఉంది. అయితే 43% అంటే, 1421 ఓట్లు పోలయ్యాయి. ప్రొడ్యూసర్స్‌ సెక్టార్‌ నుంచి 809 ఓట్లు, స్టూడియో సెక్టార్‌ 66, డిస్ట్రిబ్యూటర్స్  సెక్టార్‌ 375, ఎగ్జిబిటర్స్‌ సెక్టార్‌ 172 ఓట్లు పోల్‌ అయ్యాయి. మద్యాహ్నం మూడు గంటల తర్వాత కౌంటింగ్‌ ప్రారంభించి ఐదు గంటల తర్వాత ఫలితాలు వెల్లడిస్తారు. ఈ ఎన్నికల్లో గెలిచిన నూతన కార్యవర్గం 2027 వరకు కొనసాగనుంది.  


 
సీరియస్‌గా తీసుకోని హీరోలు..
తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఎన్నికలను హీరోలు లైట్‌ తీసుకున్నారు. నిర్మాతలుగా ఉన్న రామ్‌ చరణ్‌, కల్యాణ్‌ రామ్‌, రానా దగ్గుబాటి, రామ్‌ పొతినేని, మంచు విష్ణు, మోహన్‌ బాబు, నాగార్జున తదితరులు ఓటు హక్కు వినియోగించుకోలేదు. నాని, శ్రీవిష్ణు, సందీప్‌ కిషన్‌ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Updated Date - Dec 28 , 2025 | 02:50 PM