Telugu Film Chamber: షూటింగ్స్ ఆపండి
ABN , Publish Date - Aug 09 , 2025 | 04:08 AM
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. వెంటనే షూటింగ్‌లు ఆపివేయాలంటూ
నిర్మాతలకు ఫిల్మ్ ఛాంబర్ ఆదేశాలు
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. వెంటనే షూటింగ్‌లు ఆపివేయాలంటూ నిర్మాతలకు ఆదేశాలు జారీ చేసింది. సినీ కార్మికుల వేతనాల పెంపు అంశంపై నిర్మాతలు - ఫెడరేషన్ నాయకుల మధ్య జరుగుతున్న చర్చలు ఒక కొలిక్కిరాని నేపథ్యంలో ఫిల్మ్ ఛాంబర్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ‘స్టూడియోలు, ఔట్‌డోర్ యూనిట్లు అనుమతి లేకుండా ఎలాంటి సేవలు అందించవద్దు. ఈ ఆదేశాలను స్టూడియో యజమానులు, నిర్మాతలు సీరియస్‌గా తీసుకోవాలి. తెలుగు సినీ పరిశ్రమలోని 24 విభాగాల యూనియన్లు ఏకపక్షంగా సమ్మెకు పిలుపునివ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. చర్చలు, సంప్రదింపులకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు దూరంగా ఉండాలి’ అని ఫిల్మ్ ఛాంబర్ పేర్కొంది.