Film Chamber Elections: రసవత్తరంగా.. ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు! వాగ్వాదం

ABN , Publish Date - Dec 28 , 2025 | 10:24 AM

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ (Telugu Film Chamber) ఎన్నికలు ఆదివారం హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్‌లో ప్రారంభ‌మ‌య్యాయి.

Telugu Film Chamber Elections

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ (Telugu Film Chamber) ఎన్నికలు ఆదివారం హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్‌లో ప్రారంభ‌మ‌య్యాయి. ఉదయం 8.00 గంటలకు ప్రారంభ‌మైన ఈ ఎన్నిక‌లు మధ్యాహ్నం 1.00 గంట వరకూ సాగ‌నుండ‌గా లంచ్ బ్రేక్ త‌ర్వాత సాయంత్రం 6 గంట‌ల లోపు ఫ‌లితాలు కూడా ప్ర‌క‌టించ‌నున్నారు.

చాలా విరామం త‌ర్వాత ఈ ఎల‌క్ష‌న్లు జ‌రుగుతున్న క్ర‌మంలో టాలీవుడ్‌లో ఉత్కంఠ నెల‌కొంది. ఈ నేప‌థ్యంలో ఆదివారం ఉద‌యం ప్రారంభ‌మైన ఫిలిం ఛాంబర్ ఎన్నిక‌ల‌ పోలింగ్ మందకొడిగా కొనసాగుతుంది. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ , స్డూడియో సెక్టార్ సభ్యులు అంతా స్వ‌చ్ఛంధఃగా పాల్గొని త‌మ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అధ్యక్షుడు, కార్యదర్శి సహా 32 మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకోనున్నారు.

ఈసారి ఎగ్జిబిటర్స్ సెక్టార్ నుంచి అధ్యక్షుడు బరిలో ఉండటం విశేషం. ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, స్టూడియో సెక్టార్లకు చెందిన మొత్తం 3,355 మంది సభ్యులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అధ్యక్షుడు, కార్యదర్శి సహా 32 మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకోనున్నారు.

ఎన్నికల్లో ప్రధాన పోటీ 'మన ప్యానెల్' ఇంకా 'ప్రోగ్రెసివ్ ప్యానెల్' మధ్య జరగుతోంది. చిన్న నిర్మాతలు ఎక్కువగా మన ప్యానెల్‌కు మద్దతిచ్చారు. ఈ ప్యానెల్‌ను సీనియర్ నిర్మాతలు సి.కళ్యాణ్, చదలవాడ శ్రీనివాసరావు, టి.ప్రసన్నకుమార్ బలపరిచారు. మరోవైపు అగ్ర నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు, డి.సురేశ్ బాబు మద్దతుతో ప్రోగ్రెసివ్ ప్యానెల్ బరిలో నిలిచింది. పోలింగ్ సమయంలో ఇరు ప్యానెళ్ల సభ్యుల మధ్య కొంత వాగ్వాదం నెలకొంది.

అయితే.. ఈ క్ర‌మంలో ఇరు ప్యానెల్స్ సభ్యులు యలమంచి రవి చంద్, అశోక్ కుమార్‌ల న‌డుమ‌ కొంత వాగ్వాదం సైతం చోటు చేసుకుంది. పోగ్రెసివ్ ప్యానెల్ నుంచి అశోక్ కుమార్ గుర్తింపు లేని, చనిపోయిన ప్రొడ్యూసర్ల ఓట్లను మన ప్యానెల్ వారు వినియోగించు కుంటున్నారంటూ ఆరోపణలు వ‌చ్చాయి. ఈ సంద‌ర్భంగా ఓటు రాజకీయాలు కాదు సినిమాలు తీస్తే తెలుస్తుందంటూ అశోక్ కుమార్ ఫైర్ అయ్యారు. ఈ క్ర‌మంలో దిల్ రాజు వారిని సముదాయించారు.

Updated Date - Dec 28 , 2025 | 10:32 AM