Sreeleela: శ్రీలీల.. ఫ్రీ బర్త్ డే సెలబ్రేషన్స్! ఇలా కూడా చేస్తారా!
ABN , Publish Date - Jun 01 , 2025 | 08:24 PM
తెలుగు నాట శ్రీలీల అంటే తెలియని వారుండరు. ఇండస్ట్రీలోకి వచ్చిన రెండేండ్లోనే ఆగ్ర స్థానానికి దూసుకువచ్చింది.
తెలుగు నాట శ్రీలీల అంటే తెలియని వారుండరు. ఇండస్ట్రీలోకి వచ్చిన రెండేండ్లోనే ఆగ్ర స్థానానికి దూసుకువచ్చింది. ఆపై చేతి నిండా సినిమాలతో ఫుల్ రైజింగ్‌లో ఉంది. ఇటీవలే హిందీలోను అడుగు పెట్టి తీరిక లేకుండా గడుపుతోంది.
అయితే మరో రెండు వారాల్లో జూన్14న శ్రీలీల (Sreeleela) పుట్టిన రోజు ఉండగా వారి ఇంట ఇప్పటి నుంచే హాడావుడి మొదలైంది. ఫ్రీ బర్త్ డే అంటూ సెలబ్రేషన్స్ స్టార్ట్ చేసి జన్మదిన వేడుకలకు కొత్త భాష్యం చెప్పారు.
ఇది చూసిన వారంతా ఇదేందయ్యా ఇది ఎప్పుడు చూడలే.. పుట్టిన రోజుకు కూడా ఫ్రీ బర్త్‌డే సంబురాలు చేసుకుంటారా అనుకుంటూ నోరెళ్ల బెడుతున్నారు. ఇకపై చాలామంది ఈ వేడుకలను ఫాలో అయ్యేలా కొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది.
ఇదిలాఉంటే ప్రస్తుతం శ్రీలీల (Sreeleela) తెలుగులో ఉస్తాద్ భగత్ సింగ్, అఖిల్ లెనిన్, రవితేజ మాస్ జాతర, తమిళంతో పరాశక్తి, హిందీలో రెండు చిత్రాలు చేస్తోంది.