Ramya Pasupileti: రస ‘రమ్యం’.. నవ పారిజాతం నయనానందకరం
ABN , Publish Date - May 06 , 2025 | 06:28 PM
సోషల్ మీడియా యూజర్స్‌కు ఎక్కువగా పరిచయం చేయాల్సిన అవసరం లేని సెలబ్రిటీ రమ్య పసుపులేటి. తాజాగా హాలీడేస్ ఎంజాయ్ చేస్తూ తన ఫొటోలతో యువతకు నిద్ర లేకుండా చేస్తోంది.
ప్రస్తుతం సోషల్ మీడియా యూజర్స్‌కు ఎక్కువగా పరిచయం చేయాల్సిన అవసరం లేని నటి రమ్య పసుపులేటి (Ramya Pasupileti). గత ఐదారేండ్లుగా షార్ట్‌ఫిలింస్, చిన్న సినిమాలు చేస్తూ వచ్చిన అశించినంత గుర్తింపునకు నోచుకోలేక పోయింది.
గతేడాది వచ్చిన మారుతీ నగర్ సుబ్రమణ్యం సినిమాతో తన బబ్లీ లుక్స్, గ్లామర్‌తో ఒక్కసారిగా హాట్ టాపిక్ అయింది. ఆ తర్వాత ఇప్పటివరకు చెప్పుకోతగ్గ ఏ పెద్ద సినిమాల్లో నటించకున్నా, రావాల్సినంత బ్రేక్ రాకున్నా ఎప్పుడూ వార్తల్లో ఉంటూనే వస్తోంది.
సోషల్ మీడియాలో యమా యాక్లివ్‌గా ఉండే రమ్యకు ఫాలోవర్స్ సంఖ్య గట్టిగానే ఉంది. అందుకు తగ్గట్టుగా నిత్యం తన వెకేషన్ ఫొటోలు షేర్ చేస్తూ కుర్రకారును ముఖ్యంగా ఫాలోవర్స్‌ను మస్త్ గ్లామర్ ట్రీట్ ఇస్తూ ఉంటుంది.
తాజాగా మరోసారి వెకేషన్‌కు వెళ్లిన ఈ అచ్చ తెలుగు అందం రమ్య పసుపులేటి (Ramya Pasupileti) అక్కడ వివిధ భంగిమల్లో ఫొటోలు దిగుతూ నెట్టింట రచ్చ లేపుతోంది. గతంలో విజిట్ చేసిన బీచ్‌లలో మళ్లీ తిరుగుతూ అప్పటిలానే బికినీ వేర్‌లో సందడి చేసింది. ఇప్పుడు ఈ చిత్రమాలికలు నెట్టింట కుర్రకారును ఆగమాగం చేస్తున్నాయి. మీరు ఇప్పటి వరకు చూడకుంటే ఇప్పుడే చూసేయండి మరి.
ఇదిలాఉంటే ఇప్పుడిప్పుడే అవకాశాల కోసం కష్టపడుతున్న ఈ తేలేత సోయగం రమ్య పసుపులేటి (Ramya Pasupileti) ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న విశ్వంభర సినిమాలో చెల్లి పాత్రకు సెలక్ట్ అయి అందరినీ అశ్చర్య పరిచింది. మరో ఒకటి రెండు ప్రముఖ చిత్రాల్లో ఛాన్స్ దక్కించుకున్నట్లు సమాచారం.