సినిమా షూటింగ్‌లకు గమ్యస్థానంగా తెలంగాణ

ABN , Publish Date - Aug 08 , 2025 | 06:22 AM

సింగిల్‌ విండో వ్యవస్థలో అన్ని సినిమా షూటింగ్‌ అవసరాల కోసం ‘‘ఫిల్మ్‌ ఇన్‌ తెలంగాణ’’ పోర్టల్‌ అభివృద్థిని ‘‘వన్‌ స్టాప్‌ షాప్‌’’గా అభివృద్థి చేయడంతో సహా ఒక కార్యాచరణ ప్రణాళికను...

సింగిల్‌ విండో వ్యవస్థలో అన్ని సినిమా షూటింగ్‌ అవసరాల కోసం ‘‘ఫిల్మ్‌ ఇన్‌ తెలంగాణ’’ పోర్టల్‌ అభివృద్థిని ‘‘వన్‌ స్టాప్‌ షాప్‌’’గా అభివృద్థి చేయడంతో సహా ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించనున్నట్లు జయేష్‌ రంజన్‌ తెలిపారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, యువజనాభివృద్థి, పర్యాటక, సంస్కృతిక శాఖ, ముఖ్యమంత్రి కార్యాలయంలోని పరిశ్రమలు, పెట్టుబడుల సెల్‌ సీఈవో జయేష్‌ రంజన్‌ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఎంఐసీఈ అండ్‌ ఫిల్మ్‌ పర్యాటక రంగాలను మరింత బలోపేతం చేయడంతోపాటు ప్రోత్సహించడానికి స్టేక్‌ హోల్డర్ల సమావేశం గురువారం తాజ్‌కృష్ణలో నిర్వహించారు. పలు రంగాలకు చెందిన 40 మంది కీలక స్టేక్‌ హోల్డర్లు, పరిశ్రమల ప్రతినిధులు సమావేశమై రాష్ట్ర ఎంఐసీఈ పర్యాటక ప్రొఫైల్‌ అభివృద్థికి సమగ్ర రోడ్‌మ్యాప్‌పై చర్చించారు. సినిమా షూటింగ్‌లకు తెలంగాణను అత్యంత ేస్నహపూర్వక, తక్కువ పెట్టుబడులతో అత్యంత లాభదాయకమైన గమ్యస్థానంగా మార్చే అవకాశాలపై ఇందులో చర్చించారు. దీనిపై సమగ్ర కార్యాచరణ ప్రణాళికను ఆగస్టు చివరి నాటికి లేదా ప్రపంచ పర్యాటక దినోత్సవం (సెప్టెంబర్‌ 27) నాటికి ప్రకటిస్తామని జయేష్‌ రంజన్‌ తెలిపారు. తెలంగాణ ఫిల్మ్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దిల్‌ రాజుతో కలిసి ఫిల్మ్‌ టూరిజం, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూరిజం అండ్‌ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌(నిథిమ్‌)కు సంబంధించి స్టేక్‌ హోల్డర్ల సమావేశాన్ని కూడా నిర్వహించారు. ఈ సమావేశంలో పలు ప్రభుత్వ విభాగాల నుండి దాదాపు ఇరవై మంది ప్రతినిధులు పాల్గొన్నారు.

-హైదరాబాద్‌, (ఆంధ్రజ్యోతి)

Updated Date - Aug 08 , 2025 | 06:22 AM