Komatireddy Venkat Reddy: 30 ఏండ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. ఏనాడు జెనీలియా సినిమా మిస్ అవ్వలేదు
ABN , Publish Date - Dec 10 , 2025 | 06:06 PM
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి నటి జెనీలియా గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ (Telangana Rising Global Summit 2025) పేరిట గడిచిన రెండు మూడు రోజులుగా హైదరాబాద్ వేదికగా తెలంగాణ ప్రభుత్వం భారీ కార్యక్రమం నిర్వహించిన సంగతి అందరికీ విధితమే. ఈ నేపథ్యంలో మంగళవారం సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ప్రత్యేక ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), మంత్రులతో పాటు దేశ వ్యాప్తంగా అన్ని సినిమా ఇంగస్ట్రీల నుంచి ప్రముఖులు హజరయ్యారు.
ముఖ్యంగా బోనీ కపూర్ తనయుడు అర్జున్ కపూర్ ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించగా చిరంజీవి, తెలుగు నిర్మాతలు సురేశ్ బాబు, అల్లు అరవింద్, దిల్ రాజు, శ్యాం ప్రసాద్ రెడ్డి మలయాళం నుంచి అసిప్ అలీ, బాలీవుడ్ నుంచి రితేశ్ దేశ్‌ముఖ్, జెనీలియా, అక్కినేని అమల, పలువురు టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ నేపథ్యంలో.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) ప్రసంగిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా, ఓ మారు ఎంపీగా 30 ఏండ్లుగా రాజకీయాల్లో ఉన్నా గానీ ఏనాడు జెనీలియా (Genelia Deshmukh) సినిమాలు చూడడం మిస్ చేయలేదని, తను నా అభిమాన నటి అని జెనీలియా ఓ నేషనల్ యాక్టర్, న్యాచురల్ హీరోయిన్ నటి అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. జెనీలియా ఈ కార్యక్రమానికి రావడం నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదని థ్యాంక్యూ సిస్టర్ అంటూ ముగించారు.
ఆ మాటలతో పక్కనే ఉన్న అతిథులంతా చప్పట్లతో హర్షద్వానాలు వ్యక్తం చేశారు. అదే సమయంలో జెనీలియా ఆమె భర్త రితేశ్ నవ్వుతూ సంతోషం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మీరూ ఓ లుక్కేయండి.