OG Tickets: మహేశ్ యాదవ్ పిటిషన్.. ఉత్తర్వులను సస్పెండ్ చేస్తూ
ABN , Publish Date - Sep 25 , 2025 | 05:43 PM
'ఓజీ' సినిమా (OG movie) టికెట్ ధరల పెంపునకు సంబంధించి తెలంగాణ హైకోర్టులో ‘ఓజీ’ (OG) చిత్ర బృందానికి ఊరట లభించింది. టికెట్ రేట్లపై (Ticket Rates) సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ శుక్రవారం వరకు స్టే విధించింది
'ఓజీ' సినిమా (OG movie) టికెట్ ధరల పెంపునకు సంబంధించి తెలంగాణ హైకోర్టులో ‘ఓజీ’ (OG) చిత్ర బృందానికి ఊరట లభించింది. టికెట్ రేట్లపై (Ticket Rates) సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ శుక్రవారం వరకు స్టే విధించింది. ఈ సినిమా ప్రీమియర్స్ ప్రదర్శనతోపాటు టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. సంబంధిత మెమోను సవాలు చేస్తూ.. మహేశ్ యాదవ్ (Mahesh Yadav) అనే వ్యక్తి హైకోర్టులో (High court)పిటిషన్ దాఖలు చేశారు. విచారణ అనంతరం ఆ ఉత్తర్వులను సస్పెండ్ చేస్తూ.. జస్టిస్ ఎన్.వి శ్రవణ్‌కుమార్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు.
పవన్ కల్యాణ్ హీరోగా సుజీత్ తెరకెక్కించిన ఈ సినిమా గురువారం విడుదలైంది. బుధవారం రాత్రి ప్రీమియర్స్‌తోనే పాజిటివ్ సొంతం తెచ్చుకుంది. సినిమా విడుదల రోజు నుంచి అక్టోబరు 4 వరకు సింగిల్ స్క్రీన్స్‌లో జీఎస్టీతో కలిపి రూ.100 , మల్టీప్లెక్స్‌ల్లో రూ.150 పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం వీలు కల్పించిన విషయం తెలిసిందే.