Telangana: టికెట్ రూ.708.. హరిహర వీరమల్లుకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
ABN , Publish Date - Jul 21 , 2025 | 08:59 PM
పవన్ కల్యాణ్ హరిహర వీర మల్లుకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
పవన్ కల్యాణ్ (Pawan kalyan) హరిహర వీర మల్లు (Harihara veeramallu)కు తెలంగాణ (Telangana) ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఓ రోజు ముందుగానే అంటే జూలై 23న పెయిడ్ ప్రీమియర్‌కు అనుమతి ఇవ్వడమే గాక, జూలై 24 నుంచి 27 వరకు ఐదు షోలు వేసుకునేందుకు, టికెట్ రేట్ల పెంపునకు అనుమతినిస్తూ ప్రత్యేక జీవోను జారీ చేసింది. దీంతో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తూ.. సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నారు.
ఇక పెయిడ్ ప్రీమియర్‌కు రూ.600 ప్లస్ జీఎస్టీ టికెట్ రేటును నిర్థారించింది. దీంతో టికెట్ రేటు రూ. 708 ఉండనుంది.
ఆ తర్వాత నుంచి షోలకు మల్టిప్లెక్స్‌లలో టికెట్ రేటుకు అదనంగా రూ200, సింగిల్ స్క్రీన్లలో టికెట్ రేట్లకు అదనంగా రూ.150 పెంచుకునేందుకు అనుమతులు ఇచ్చింది. దీంతో మల్టీ ప్టెక్స్‌లలో రూ.531, సింగిల్ థియేటర్లలో రూ. ₹354 ఉండనుంది.
ఆపై జూలై 28 నుంచి ఆగష్టు 2 వరకు మల్టీప్లెక్సులలో టికెట్ పై అదనంగా రూ.150, సింగిల్ స్క్రీన్లలో టికెట్ పై అదనంగా రూ.106 పెంచుకోవచ్చు. దీంతో మల్టీప్లెక్సులలో రూ.472, సింగిల్ స్క్రీన్లలో రూ. 302గా ధరలు ఉండనున్నాయి.