Gaddar Awards: తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ మెమెంటో ప్రత్యేకత ఇదే
ABN , Publish Date - Jun 09 , 2025 | 09:21 PM
ఇటీవల తెలంగాణ ప్రభుత్వం (TGS Govt) గద్దర్ అవార్డులను (Gaddar Film awards) ఏర్పాటు చేసి ఓయ కమిటీ వేసి ప్రతిభ గల వారికి విభాగాల వారీగా ప్రకటన చేశారు.
ఇటీవల తెలంగాణ ప్రభుత్వం (TGS Govt) గద్దర్ అవార్డులను (Gaddar Film awards) ఏర్పాటు చేసి ఓయ కమిటీ వేసి ప్రతిభ గల వారికి విభాగాల వారీగా ప్రకటన చేశారు. ఈ నెల 14న హైటెక్స్ వేదికగా వైభవంగా ఈ వేడుకను నిర్వహించబోతుంది. ఈ సందర్భంగా విజేతలకు ప్రదానం చేసే గద్దర్ (Tollywood) అవార్డు మెమెంటోను ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసింది.
తెలంగాణ చలన చిత్రాభివృద్థి సంస్థ ప్రత్యేకంగా గద్దర్ మెమెంటోను తయారు చేయించింది. ఫిల్మ్ రీల్ చేతిని చుట్టుకున్నట్లుగా.... పైకెత్తిన చేతిలో డప్పు నమూనాతో గద్దర్ అవార్డును తీర్చిదిద్దారు. డప్పుపై తెలంగాణ రాష్ట్ర చిహాన్ని ముద్రించి చుట్టూ టీజీఎఫ్‌ఏ అక్షరాలను రాసుకొచ్చారు. ఈ మెమెంటోను గద్దర్ అవార్డుగా విజేతలైన సినీ ప్రముఖులకు ప్రభుత్వం అందించనుంది. గద్దర్ అవార్డులను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం హైదరాబాద్‌లోని మెయిన్ జంక్షన్స్ దగ్గర హోర్డింగ్‌లను ఏర్పాటు చేసింది.