Folk Song: చికెనే తెత్త‌డో నా అల్లుడు.. లేక బీరే తెత్త‌డో! యూట్యూబ్‌ను.. షేక్ చేస్తున్న కొత్త ఫోక్‌ సాంగ్‌

ABN , Publish Date - Dec 26 , 2025 | 09:39 AM

ఇటీవ‌ల జాప‌ద పాట‌లు యూత్‌ను, సోష‌ల్ మీడియాను ఓ ఊపు ఊపుతున్న విష‌యం తెలిసిందే.

Folk Song

ఇటీవ‌ల జాప‌ద పాట‌లు యూత్‌ను, సోష‌ల్ మీడియాను ఓ ఊపు ఊపుతున్న విష‌యం తెలిసిందే. ఒక‌దాని త‌ర్వాత మ‌రోటి, ఒక‌దాన్ని మించి మ‌రో పాట నిత్యం యూట్యూబ్‌లో రిలీజ్ అవ్వుతూ ఆడియ‌న్స్‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంటున్నాయి. ఈ క్ర‌మంలో తాజాగా మ‌రో తెలంగాణ జాన‌ప‌ద‌ వీడియో సాంగ్‌ లేటెస్ట్‌గా సామాజిక మాధ్య‌మాల్లో రిలీజ్ అయి ట్రెండింగ్ అవుతుంది.

చికెనే తెత్త‌డో నా అల్లుడు లేక మ‌ట‌నే తెత్త‌డో నా అల్లుడు బీరే తెత్త‌డో నా అల్లుడు లేక క్వార్ట‌రే తెత్త‌డో నా అంటూ (CHICKEN YE THESTHADO NA ALLUDU FULL SONG) సాగే ఈ పాట యూట్యూబ్‌కు ప‌ట్టిన బూజును దులిపేస్తోంది. ఫ‌స్ట్ నుంచి లాస్ట్ వ‌ర‌కు అదిరిపోయే బీట్ , స్టెప్పుల‌తో వినే వారికి భ‌లే కిక్ ఇస్తోంది. ఒక్క మారు విన్న‌వారు ప‌దే ప‌దే అదే పాట‌ను వింటూ ఎంజాయ్ చేస్తున్నారు.

అంజీ పీట్ల (ANJI PEETLA ) ఈ పాట‌కు సాహిత్యం అందించ‌గా క‌ల్యాణ్ కీస్ (KALYAN KEYS) సంగీతంలో ప్ర‌ముఖ ఫోక్ సింగ‌ర్‌ ప్ర‌భ (PRABHA) ఆల‌పించింది. శేఖ‌ర్ వైర‌స్ (SHEKAR VIRUS) డ్యాన్స్ స‌మ‌కూర్చగా ప్రియ (PRIYA) ఈ సాంగ్‌లో న‌ర్తించింది. నాలుగు నిమిషాల మూడు సెక‌న్లు ఉన్న ఈ పాట పిల్ల‌నిచ్చిన మామ త‌న అల్లుడి గురించి పాడుకునే కాన్సెప్ట్‌లో ఉంది.

ఇక పాట‌ సాహిత్యం, సంగీతం, నృత్యం అన్ని కూడా అది బాగా లేదు అనే మాట చెప్ప‌లేకుండా అన్ని డాపార్ట్‌మెంట్లు ఒక‌దాన్ని మించి మ‌రోటి హైల‌ట్‌గా ఉన్నాయి. ముఖ్యంగా బ‌స్సుపై, బుర‌ద గుంట‌లో కుస్తీ నేప‌థ్యంలో వ‌చ్చే స్టెప్పులు ఎక్ట్రార్డీన‌రీగా ఉండ‌గా, విజువ‌ల్స్ సైతం అద్భుతంగా ఉన్నాయి. వీరిలో కొద్దిమందికి త్వ‌ర‌లోనే సినిమాల నుంచి కూడా ఛాన్స్ వ‌చ్చే అవ‌కాశాలు కూడా పుష్క‌లంగా ఉన్నాయి. మీరు ఇంకా విన‌కుంటే ఇప్పుడే ఈ వీడియో సాంగ్‌పై ఓ లుక్కేయండి.

Updated Date - Dec 26 , 2025 | 09:39 AM