Teja Sajja:డిమోంటీ కాల‌నీ లోకి తేజ సజ్జా ఎంట్రీ

ABN , Publish Date - Jun 05 , 2025 | 06:28 PM

పాన్ ఇండియా రేంజ్ లో స్ట్రాంగ్ అయ్యాక.. ఓ కుర్ర హీరో మనసు ఊరుకోవడం లేదు. ఇండస్ట్రీలో ఎలాగైనా గట్టిగా పాతుకుపోవాలని తెగ కష్టపడుతున్నారు. అందు కోసం అతగాడు చేస్తున్న ప్రయత్నాలు హాట్ టాపిక్ గా మారాయి.

చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన తేజ సజ్జా (Teja Sajja)... ప్రస్తుతం హీరోగానూ రాణిస్తున్నాడు. జాంబిరెడ్డి మూవీతోనే తొలిసారి ప్రయోగం చేసిన తేజ ఇప్పుడు డిఫరెంట్ జానర్ సినిమాలతో జోరుమీదున్నాడు. హనుమాన్ (Hanu-Man) తో పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటిన తేజ... ఇప్పుడు సూపర్ కంటెంట్ సినిమాలతో దూసుకుపోతున్నాడు. పైగా ఆ మూవీతో వందకోట్ల క్లబ్ లో చేరిన కుర్ర హీరో.... మిరాయ్ గా త్వరలో పలకరించబోతున్నాడు. తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది.


ఆగస్ట్ లో విడుదల కానున్న మిరాయ్ ( Mirai ) మూవీపై ఫోకస్ పెట్టాడు తేజా సజ్జా. కార్తీక్ ఘట్టమనేని (Karthik Gattamneni) డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీలో సూపర్ యోధగా పవర్‌ఫుల్ రోల్ లో కనిపించనున్నాడు. ప్రస్తుతం శరవేగంగా ఈ షూటింగ్ జరుగుతోంది. అయితే ఈ మూవీ కంప్లీట్ అయిన తర్వాత కోలీవుడ్ డైరెక్టర్ తో జోడీకట్టబోతున్నట్లు ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే ఇద్దరి మధ్య చర్చలు కూడా జరిగాయని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.

హార‌ర్ థ్రిల్ల‌ర్ మూవీలకు కేరాఫ్ గా మారిన అజ‌య్ జ్ఞాన ముత్తు(Ajay Gnanamuthu )తో తేజ మూవీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. సినిమా సినిమాకు కొత్త వేరియేష‌న్ చూపిస్తూ... మూవీ లవర్స్ లో సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు డైరెక్టర్ . అంతేకాక డిమోంటీ కాలనీ (Demonte Colony) సిరీస్ తో బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకున్నాడు. తాజాగా మూడో భాగాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నాడట. భారీ బడ్జెట్ తో డీమోంటీ కాల‌నీ 3 ని తీసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఈ మూవీలో కీ రోల్ కోసం తేజ సజ్జా పేరును పరిశీలిస్తున్నారట. ఇప్పటికే ఇద్దరి మధ్య చర్చలు జరిగాయని... త్వరలోనే అధికార ప్రకటన వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. మరీ డిఫరెంట్ జానర్లతో పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటుతున్న కుర్ర హీరో... కోలీవుడ్ దర్శకుడితో కలసి ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.

Updated Date - Jun 05 , 2025 | 06:28 PM