Pellichoopulu: మరోసారి వెండితెరపై క్రేజీ కాంబో...

ABN , Publish Date - May 07 , 2025 | 03:07 PM

విజయ్ దేవరకొండ, తరుణ్ భాస్కర్ కాంబోలో వచ్చిన తొలి చిత్రం 'పెళ్ళిచూపులు'. తర్వాత తరుణ్ భాస్కర్... విజయ్ కాంబో రిపీట్ కాలేదు... అదిప్పుడు జరుగబోతోంది.

యూ ట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్ నుండి సిల్వర్ స్క్రీన్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి తరుణ్‌ భాస్కర్ (Tarun Bhaskar) . దర్శకత్వం వహించిన తొలి చిత్రం 'పెళ్ళిచూపులు' (Pellichupulu) తోనే తనదైన ముద్రను తెలుగు ప్రేక్షకుల మీద వేశాడు. ఆ తర్వాత 'ఈ నగరానికి ఏమైంది?' (Ee nagaraniki emaindi) వంటి యూత్ ఫుల్ డ్రామాను తెరక్కెకించాడు. ఈ సినిమా కమర్షియల్ గా ఆడకపోయినా... తరుణ్‌ భాస్కర్ కు, అందులోని నటీనటులకు మంచి గుర్తింపునైతే ఇచ్చింది. అదే ఊపుతో తరుణ్‌ భాస్కర్ తెరకెక్కించిన 'కీడాకోలా' (Keedaa Cola) దారుణంగా పరాజయం పాలైంది. ఇదే సమయంలో తరుణ్‌ భాస్కర్ నటనవైపు మొగ్గు చూపాడు. సినిమా రంగంలో తెలిసినవాళ్ళు, స్నేహితులు ఒత్తిడి చేయడంతో కొన్ని సినిమాలలో కీలక పాత్రలు పోషించాడు. ఇప్పుడు దర్శకుడిగా, నటుడిగా రెండు పడవల ప్రయాణం చేస్తున్నాడు.


బేసికల్ గా డైరెక్టర్ అయిన తరుణ్‌ భాస్కర్ కు కసితో ఓ కమ్ బ్యాక్ మూవీ ఇవ్వాలనే కోరిక బలంగా ఉంది. అందుకోసం 'ఈ నగరానికి ఏమైంది'కి సీక్వెల్ తీయాలని అనుకున్నాడు. అయితే ఇప్పుడు విశ్వక్ సేన్ మార్కెట్ అంత బాగోకపోవడం, అతని సినిమాలు వరుసగా ఫెయిల్ కావడంతో నిర్మాత విశ్వక్ తో మూవీ చేయడానికి ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. దాంతో మనసు మార్చుకున్న తరుణ్‌ భాస్కర్... తన తొలి చిత్ర కథానాయకుడు, 'పెళ్ళిచూపులు' హీరో విజయ్ దేవరకొండ కోసం ఓ కథను తయారు చేశాడట. విశేషం ఏమంటే...'పెళ్ళిచూపులు' నుండి తరుణ్‌ - విజయ్ మధ్య మంచి బాండింగ్ ఉంది. విజయ్ దేవరకొండ 'మీకు మాత్రమే చెప్తా' (Meeku Maathrame Cheptha) మూవీ నిర్మిస్తూ తరుణ్‌ భాస్కర్ నే హీరోగా పెట్టుకున్నాడు. ఆ కారణంగానే విజయ్ దేవరకొండతో తన తదుపరి చిత్రాన్ని తరుణ్‌ ప్లాన్ చేశాడట. దీనిని జిఎ 2 సంస్థ నిర్మించ బోతోందని తెలుస్తోంది. విజయ్ దేవరకొండ కూడా ఇప్పుడు సెట్స్ మీద ఉన్న సినిమాలను పూర్తి చేసే పనిలో ఉండటంతో ఇది వచ్చే యేడాదే పట్టాలెక్కుతుందని అనుకుంటున్నారు.

Also Read: Mass Maharaja: రవితేజ, కిశోర్ తిరుమల కాంబోలో మూవీ...

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - May 07 , 2025 | 03:08 PM