Harihara Veeramallu: హరి హర వీరమల్లు నుంచి.. తార పాటొచ్చేసింది
ABN , Publish Date - May 28 , 2025 | 10:56 AM
పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి తార తార అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు.
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటించిన భారీ పాన్ ఇండియా చిత్రం 'హరి హర వీరమల్లు' (Hari Hara Veera Mallu) విడుదలకు ముస్తాబవుతోంది. ఇస్సటికే ప్రచార కార్యక్రమాలు ప్రారంభించిన చిత్ర యూనిట్ ఈ సినిమా నుంచి పాటలు విడుదల చేస్తూ ప్రేక్షకుల్లో అంచనాలు అంతకంతకు పెంచేస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన మూడు పాటలు ఒక దాన్ని మిచి మరోటి విజయం సాధించగా తాజాగా బుధవారం ఈ మూవీ నుంచి తార తార (Taara Taara ) అంటూ సాగే మరో పాటను విడుదల చేశారు.
మూవీ కథానాయుక నిధి ఆగర్వాల్ (Nidhhi), సునీల్, రెడ్ కింగ్‌స్లే తదితర డ్యానర్లపై ఈ పాటను చిత్రీకరించగా చివర్లో పవన్ ఓ రెండు సెకన్లు కనిపించి కిక్ ఇచ్చారు. ఈ పాటకు శ్రీహర్ష ఈమని సాహిత్యం అందించగా లిప్సిక (Lipsika Bhashyam), అదిత్య అయ్యంగార్ (Aditya Iyengar) ఆలపించారు. ఆస్కార్ విన్నర్ కీరవాణి ( MM Keeravaani) సంగీతం అందించారు. ఇదిలా ఉంటే ఈ పాట విడుదలైన క్షణాల్లోనే అధిక వ్యూస్ దక్కించుకుంటూ యూ ట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తూ దూసుకెళుతుంది.