Prem Kumar: గిఫ్ట్‌ కాదు..  అన్న నెరవేర్చిన  కల..

ABN, Publish Date - May 11 , 2025 | 02:56 PM

ప్రేమ్‌కుమార్‌ ఎన్నో ఏళ్ల కలను తాజాగా సూర్య, కార్తి నెరవేర్చారు. ఆయనకు ఎంతో ఇష్టమైన మహీంద్రా థార్‌ను గిఫ్ట్‌గా (Car gift) అందించారు.


కార్తి(Karthi), అరవింద స్వామి (Aravind swami)ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘మెయ్యజగన్‌’. ‘96’ ఫేమ్‌ ప్రేమ్‌ కుమార్‌ (Prem Kumar) ఈ చిత్రానికి దర్శకుడు. తెలుగులో ‘సత్యం సుందరం’ పేరుతో విడుదల చేశారు. ఫీల్‌గుడ్‌ కథగా తెలుగులోనూ సూపర్‌హిట్‌ అయింది. ఈ చిత్ర దర్శకుడు ప్రేమ్‌కుమార్‌ ఎన్నో ఏళ్ల కలను తాజాగా సూర్య, కార్తి నెరవేర్చారు. ఆయనకు ఎంతో ఇష్టమైన మహీంద్రా థార్‌ను గిఫ్ట్‌గా (Car gift) అందించారు. దీనిపై ప్రేమ్‌కుమార్‌ ఆనందం వ్యక్తం చేశారు. హీరోలకు కృతజ్ఞతలు చెబుతూ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టారు.

 
‘‘మహీంద్రా థార్‌ అంటే నాకెంతో ఇష్టం. అది నా డ్రీమ్‌ వెహికల్‌. 5 డోర్‌ వెర్షన్‌ కోసం ఎంతోకాలంగా ఎదురుచూశా. మరీ ముఖ్యంగా Roxx AX 5L కలర్  థార్‌ కోసం వేచి చూశా. ఎట్టకేలకు అది మార్కెట్‌లోకి వచ్చింది. దాచుకున్న డబ్బుతో దానిని కొనుగోలు చేయ్చానుకున్నా. కాకపోతే బుక్‌ చేశాక ఏడాదిపాటు ఎదురుచూడాలని తెలిసింది. ఆ తర్వాత నా దగ్గర ఉన్న  డబ్బు కూడా ఖర్చు అయిపోయింది. దీంతో నా కలను విరమించుకున్నా. మొన్న సూర్య నుంచి నాకొక సందేశం వచ్చింది. నాకెంతో ఇష్టమైన కారు ఫోటో పంపించి.. ‘‘కారు వచ్చేసింది’’ అని అన్నారు. నాకేం అర్థం కాలేదు. ఫొటో చూసి షాకయ్యా. సూర్య నా కోసం ఈ కారు కొని గిఫ్ట్ గా ఇచ్చారు. కార్తి చేతుల మీదుగా కారు తాళాలు అందుకున్నా. దీనిని నేను గీఫ్ట్‌గా చూడను. ఒక అన్న తన తమ్ముడి కలను నెరవేర్చినట్లు చూస్తా’’ అని పోస్ట్‌ చేశారు. గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘మెయ్యజగన్‌’ చిత్రానికి సూర్య, జ్యోతిక నిర్మాతలుగా వ్యవహరించారు. 

Updated Date - May 11 , 2025 | 02:56 PM