Suresh Babu: చూడగానే కొనేశాం...

ABN , Publish Date - Dec 29 , 2025 | 06:09 PM

శ్రీనందు, యామిని భాస్కర్ జంటగా నటించిన సినిమా 'సైక్ సిద్ధార్థ'. ఈ సినిమా చూసిన వెంటనే కొనమని తన వాళ్ళకు చెప్పానని ప్రముఖ నిర్మాత డి. సురేశ్‌ బాబు చెప్పారు.

Psych Siddhartha Movie

సురేశ్‌ ప్రొడక్షన్స్ అధినేత, ప్రముఖ నిర్మాత, తాజాగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్‌ కామర్స్ అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తి డి. సురేశ్‌ బాబు (D Suresh Babu). కొత్త సంవత్సరం తొలి రోజునే సురేశ్‌ బాబు 'సైక్ సిద్ధార్ధ' మూవీని విడుదల చేస్తున్నారు. వరుణ్ రెడ్డి (Varun Reddy) దర్శకత్వంలో శ్రీనందు (Srinandu), యామిని భాస్కర్ (Yamini Bhaskar) జంటగా ఇందులో నటించారు. శ్యామ్ సుందర్ రెడ్డి తుడి తో కలిసి శ్రీనందు దీన్ని ప్రొడ్యూస్ చేశారు. జనవరి 1న రాబోతున్న ఈ సినిమా ప్రెస్ మీట్ సోమవారం జరిగింది.

ఈ సందర్భంగా డి. సురేష్ బాబు మాట్లాడుతూ, 'సినిమాలకి... ముఖ్యంగా చిన్న సినిమాలకి ఆడియన్స్ థియేటర్స్ కి రావడం తగ్గిపోతుందని తరుచు మాట్లాడుతుంటాం. అయితే కొన్నిసార్లు చిన్న సినిమాలని ఆడియన్స్ చాలా అద్భుతంగా ధియేటర్స్ లో ఆదరిస్తున్నారు. 'రాజు వెడ్స్ రాంబాయి, లిటిల్ హార్ట్స్' లాంటి కొన్ని సినిమాలకు మంచి ఆదరణ లభించింది. అలాగే ఇతర భాషల్లో కూడా చిన్న సినిమాలు అద్భుతాలు చేస్తున్నాయి. చిన్న సినిమాలపై హోప్ అయితే ఉంది. ఈ సినిమాని సపోర్ట్ చేయడానికి కారణం డైరెక్టర్ వరుణ్ సినిమాని చాలా డిఫరెంట్ ప్రజెంట్ చేశాడు. సినిమాని చూసిన వెంటనే తీసుకోమని చెప్పాను. చాలా ఇంట్రెస్టింగ్ గా సినిమా తీశారు. సినిమా బాగుంటే ఆడియన్స్ కచ్చితంగా చూస్తున్నారు. అలాగే టికెట్ రేట్స్ కూడా మేం దృష్టిలో పెట్టుకుంటున్నాం. ఈ సినిమా టికెట్ కేవలం 99 రూపాయలు మాత్రమే' అని అన్నారు.


హీరో శ్రీనందు మాట్లాడుతూ, 'దండోరా' లో నా పర్ఫార్మెన్స్ కి చాలా మంచి అప్రిషియేషన్స్ ఇచ్చారు. ఈ సినిమా రిలీజ్ కి ముందు అది నాకు మంచి బూస్ట్ ఇచ్చింది. 31 నైట్ డల్లాస్ లో గీత స్పెషల్ షో అరేంజ్ చేసాం. అక్కడ గీతతో పాటు స్పెషల్ చూడాలని కోరుతున్నాను. సురేష్ బాబు గారు మా సినిమాని తీసుకున్నారు. 2026 జనవరి 1న సినిమా వస్తుంది. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. అయితే అనుకోని పరిస్థితులలో సినిమా వాయిదా పడాల్సి వచ్చింది. అప్పుడు నిజంగానే భయపడ్డాను. అయితే ఏం జరిగినా మన మంచికే ధైర్యంగా ఉండాలి అని చెప్పిన మా నాన్న గారి మాట గుర్తొచ్చింది. మళ్లీ ఒక ఉత్సాహంతో ఈ సినిమాని ప్రమోట్ చేసుకుంటూ వచ్చాం' అని చెప్పాడు. డైరెక్టర్ వరుణ్ రెడ్డి మాట్లాడుతూ, 'థియేటర్స్ కి వచ్చి గట్టిగా కేకలు వేసి ఫుల్ గా ఎంజాయ్ చేసే తెలుగు ఆడియన్స్ కి ఈ సినిమా అంకితం. కనీసం 30 నిమిషాల పాటు నాన్ స్టాప్ గా కేకలు వినిపిస్తాయి. అది మేం ప్రీమియర్స్ లో కూడా చూసాం' అని అన్నాడు. జీవితంలో సెకండ్ ఛాన్స్ చాలా ఇంపార్టెంట్ అని, తన కెరీర్ కు ఇది సెకండ్ ఛాన్స్ అని హీరోయిన్ యామిని భాస్కర్ చెప్పారు. ఈ సినిమాను ఇప్పటికే దాదాపు వంద సార్లు చూశానని, చూసిన ప్రతిసారి ఎంజాయ్ చేశానని సంగీత దర్శకుడు స్మరణ సాయి తెలిపాడు.

Also Read: Sahakutumbanam: కొత్త సంవత్సరం తొలి రోజున 'సఃకుటుంబానాం'

Also Read: Peddi: పెద్దిలో అప్పలసూరిగా స్టార్ నటుడు.. గుర్తుపట్టారా ఎవరో

Updated Date - Dec 29 , 2025 | 06:09 PM