Adi Seshagiri Rao: పద్మాలయా స్టూడియోస్‌లో.. కృష్ణ విగ్రహం, ఫిల్మ్ ఇనిస్టిట్యూట్

ABN , Publish Date - Nov 15 , 2025 | 05:37 AM

పద్మాలయా స్టూడియోస్‌లో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహం ఒక ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ కూడా ఏర్పాటు చేస్తామని సీనియర్ నిర్మాత, హీరో కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు వెల్లడించారు.

Adi Seshagiri Rao

'శంషాబాద్‌లో ఉన్న పద్మాలయా స్టూడియోస్‌లో సూపర్ స్టార్ కృష్ణ (Superstar Krishna)విగ్రహం ఏర్పాటు చేయబోతున్నామని, అక్కడే ఒక ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ కూడా ఏర్పాటు చేస్తామని సీనియర్ నిర్మాత, హీరో కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు (Ghattamaneni Adi Seshagiri Rao) వెల్లడించారు.

కృష్ణ వర్ధంతి సందర్భంగా ఆయన 'చిత్రజ్యోతి'తో మాట్లాడారు. 'పద్మాలయాలో పనిచేసిన వాళ్లు సంస్థ గురించి గొప్పగా చెబుతూ ఉంటారు. నేను ఏర్పాటు చేయ బోయే ఫిల్మ్ ఇనిస్టిట్యూట్లో శిక్షణ పొందే వారు కూడా భవిష్యత్తులో అలాగే చెప్పుకోవాలని మేము ఆశిస్తున్నాం' అని ఆయన అన్నారు.

భారత ప్రేక్షకులనే కాకుండా లోకల్ ఆడియన్స్‌ను అలరించే విధంగా రాజమౌళి (Rajamouli) -మహేశ్ బాబు (Mahesh Babu) కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా విజయవంతం అవుతుందని ఆయన పేర్కొన్నారు.

కొత్త ప్రయోగాలు చేయడానికి అన్నయ్య ఉత్సాహం చూపించేవారు. ఈ చిత్రానికి సంబంధించి గ్లోబల్ ట్రాటర్ పేరుతో రాజమౌళి నిర్వహిస్తోన్న భారీ ఈవెంట్ పట్ల అందరూ ఆసక్తి చూపుతున్నారు. హాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థలు మాత్రమే ఇలాంటి వేడుకలు నిర్వహించేవి.

మన తెలుగులో ఒక సినిమా ప్రమోషన్ ను ఇంత భారీగా నిర్వహించడం, ఆదీ కృష్ణ గారి వర్ధంతి రోజు కావడం మా అందరికీ ఎంతగానో ఆనందం కలిగిస్తోంది. అన్నయ్య ఆశయాలను మహేశ్ ముందుకు తీసుకెళ్తున్నాడు' అని ఆదిశేషగిరి రావు అన్నారు.

మూడో తరం వస్తోంది..

'మా వంశం నుంచి మూడో తరం హీరోగా జయకృష్ణ (Jayakrishna) ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అతను న్యూయార్క్ ఫిల్మ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో మూడేళ్ల కోర్సు పూర్తి చేశాడు. ఒక కొత్త హీరోకి ఏయే లక్షణాలు, అర్హతలు ఉండాలో అవన్నీ సంపాదించుకున్నాడు. ఆ తర్వాతే ఎంట్రీ ఇస్తున్నాడు. తనతో సినిమా తీస్తున్న అశ్వనీద‌త్‌తో మాకు మంచి సంబంధాలు ఉన్నాయి. అన్నయ్యతో 'ఆగ్నిపర్వతం'. మహేశ్‌తో 'రాజకుమారుడు' సినిమాలు తీశారు. ఇప్పుడు మూడో తరాన్ని కూడా పరిచయం చేస్తున్నారు' అని ఆది శే షగిరిరావు చెప్పారు.

Updated Date - Nov 15 , 2025 | 06:42 AM