Rajinikanth: సాధార‌ణ వ్య‌క్తిలా.. రోడ్డు పైనే టిఫిన్ చేసిన రజనీకాంత్

ABN , Publish Date - Oct 06 , 2025 | 08:33 AM

ఇటీవ‌ల కూలీ సినిమాతో మంచి హిట్ అందుకున్న సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ సినిమా చిత్రీకరణల‌ నుంచి కాస్త విరామం తీసుకున్నారు.

Rajinikanth

ఇటీవ‌ల కూలీ సినిమాతో మంచి హిట్ అందుకున్న సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ (Rajinikanth) సినిమా చిత్రీకరణల‌ నుంచి కాస్త విరామం తీసుకున్నారు. ఇటీవ‌ల జైల‌ర్‌2 షెడ్యూల్ పూర్తి చేసిన ఆయ‌న కాస్త విశ్రాంతి మోడ్‌లోకి వెళ్లారు.

Rajinikanth

తన సినిమా విడుదలైన ప్రతిసారీ హిమాలయాలకు రజనీ కాంత్ వెళ్తుంటారు.ఈ క్ర‌మంలో త‌న‌కు అల‌వాటైన ఆధ్య‌త్మిక యాత్ర మొద‌లు పెట్టాడు. సన్నిహితులతో కలిసి రిషికేశ్‌లో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించారు.

Rajinikanth

త‌న తోటి స‌హ‌చ‌ర న‌టీన‌టులంతా చెన్నైలో 80 తార‌ల గెట్ టూ గెద‌ర్ పాల్గొని సంద‌డి చేయ‌గా ర‌జ‌నీకాంత్ మాత్రం హిమాలయాల పర్యటన చేప‌ట్టారు. ఈ సందర్భంగా ఆయన ఓ ప్రాంతంలో ఓ సామాన్య మ‌నిషిలా రోడ్డుపైనే టిఫిన్ చేస్తూ కనిపించారు.

Rajinikanth

రోడ్డు పక్కన సాధారణ వ్యక్తిగా భోజనం చేస్తూ, ఆశ్రమంలో స్థానికులతో సంభాషిస్తున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Rajinikanth

Updated Date - Oct 06 , 2025 | 08:36 AM