Super Heroes: వెండితెరపై సూపర్ హీరోస్

ABN , Publish Date - Jun 09 , 2025 | 06:31 PM

సూపర్ హీరోస్ మూవీస్ సరిగా రూపొందితే ఆబాలగోపాలాన్ని అలరిస్తాయి... ఆ నమ్మకంతోనే హాలీవుడ్ లో ఈ నాటికీ సూపర్ హీరో ఫిలిమ్స్ తెరకెక్కుతూనే ఉన్నాయి... మేమేం తక్కువ కాదంటూ ఇండియన్ మూవీమేకర్స్ కూడా సూపర్ హీరోస్ కథల వెంట పడుతున్నారు... మన టాలీవుడ్ జనం మరింత విశేషంగా సాగుతున్నారు.

సూపర్ హీరో మూవీస్' (Super Heros Movies) ఈ మధ్య హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ అన్న తేడా లేకుండా అంతటా అలరిస్తున్నాయి... గత సంవత్సరం సంక్రాంతి బరిలో దూకిన 'హనుమాన్' (Hanu-Man) ఘనవిజయం సాధించింది... దాంతో టాలీవుడ్ లోనూ సూపర్ హీరో మూవీస్ సందడి సాగడం మొదలయింది... ఆ మాటకొస్తే అంతకు ముందు వచ్చిన 'కార్తికేయ -2' (Kartikeya-2)లోనూ హీరోకు ఓ పవర్ ఉన్న కారణంగానే సైంటిస్ట్ అతనికే శ్రీకృష్ణుని కాలి కడియం గురించిన అంశం చెబుతాడు... ఇలా లెక్క చూసుకుంటూ పోతే చాలానే ఉన్నాయి... ప్రస్తుతం తెలుగువారిని అలరించడానికి మూడు సూపర్ హీరో మూవీస్ సిద్ధమవుతున్నాయి... వాటిలో మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' (Vishwambhara) ఒకటి... ఈ సినిమా సంక్రాంతికే వస్తుందన్నారు... గ్రాఫిక్స్ కారణంగా ఆలస్యమవుతూ వస్తోంది... ఇక 'హనుమాన్' సక్సెస్ తరువాత యంగ్ హీరో తేజ సజ్జాతో 'మిరాయి' (Mirai) అనే మరో సూపర్ హీరో మూవీ రూపొందింది... ఈ చిత్రం ఈ యేడాది సెప్టెంబర్ లో రానుంది... ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా అట్లీ రూపొందించబోయే సినిమా కూడా సూపర్ హీరో పిక్చరే!... రెబల్ స్టార్ ప్రభాస్ తో రూపొందిన 'కల్కి 2898 ఏడి' (Kalki 2898 ) లో మైథలాజికల్ టచ్ ఉన్నా అదీ ఆ కోవకు చెందిందే...


సూపర్ హీరోస్ మూవీస్ ఈ తరం వారు ఆదరించడం కాదు ఏ నాటి నుంచో అలరిస్తూనే ఉన్నాయి... అయితే అవి జానపదాల రూపంలో ఉండేవి... హాలీవుడ్ 'సూపర్ మేన్' (Super Man) సినిమా ఘనవిజయంతో సూపర్ హీరో మూవీస్ అంటూ వస్తున్నాయి... నాలుగున్నర దశాబ్దాల క్రితం యన్టీఆర్ (NTR)తో సోషియో ఫాంటసీగా 'సూపర్ మేన్' మూవీని తెరకెక్కించారు వి.మధుసూదనరావు (V. Madhusudhan Rao) అదే మన దేశంలో తొలి సూపర్ హీరో మూవీగా నిలచింది... ఆ తరువాత వచ్చిన సినిమాలను కూడా సోషియో ఫాంటసీస్ గానే గుర్తించారు... బాలీవుడ్ లో 'క్రిష్' (krishh )సిరీస్ విజయం సాధించడంతో 'సూపర్ హీరో మూవీస్' అనే మాట మళ్ళీ విశేషంగా వినిపిస్తోంది... అంతకు ముందు కొన్ని సోషియో ఫాంటసీస్ లోనూ హీరోకు దైవానుగ్రహం వల్ల అద్భుత శక్తులు లభించే కథాంశాలు చోటు చేసుకున్నాయి... అయితే అది యన్టీఆర్ 'సూపర్ మేన్'తోనే మొదలు కావడం విశేషంగా నిలచింది...

ప్రస్తుతం బాలీవుడ్ లో హృతిక్ రోషన్ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో 'క్రిష్ 5' (krishh -5) సూపర్ హీరో మూవీ తెరకెక్కనుంది... ఇక ఆమిర్ ఖాన్ (Aamir Khan)తో లోకేశ్ కనకరాజ్(Lokesh Kanagaraj ) తీసే చిత్రం కూడా ఈ కోవకు చెందిందే... రిషబ్ శెట్టి (Rishab Shetty) హనుమంతునిగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) రూపొందించే 'జై హనుమాన్'(Jai Hanuman), అదే ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో కళ్యాణ్ దాసరి (Dasari Kalyan) నటించే 'అధిరా'(Adhira) కూడా సూపర్ హీరో మూవీస్... పూజా అపర్ణ కొల్లూరు (Puja Aparna Kolluru) దర్శకత్వంలో ప్రశాంత్ వర్మ నిర్మించే సినిమా, రవితేజ (Ravi Teja) హీరోగా కళ్యాణ్ శంకర్ (Kalyan Shankar) తెరకెక్కించనున్న చిత్రం సూపర్ హీరోస్ మూవీస్ గానే రూపొందనున్నాయి... 'మహా కాళి' (Maha Khali) అనే లేడీ ఓరియెంటెడ్ సూపర్ హీరో పిక్చర్ కూడా రానుంది... మళయాళంలో ఉన్నిముకుందన్ (Unni Mukundan) డైరెక్షన్ లో రూపొందే తొలి చిత్రం, కళ్యాణి ప్రియదర్శన్ (Kalyani Priyadarshan) ప్రధాన పాత్రధారిగా దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) నిర్మించే సినిమా, నివిన్ పౌలీ (Nivin Pauly) హీరోగా తెరకెక్కే 'మల్టీవర్స్ మన్మథ' (Multiverse Manmadhan) కూడా ఇదే తీరున అద్భుత శక్తులతో అలరించనున్నాయి... మరి ఇన్ని సినిమాల్లో ఏది ప్రేక్షకులను విశేషంగా అలరిస్తుందో చూడాలి.

Updated Date - Jun 09 , 2025 | 07:16 PM