Trimukha: సన్నీ లియోన్.. తెలుగు సినిమా విడుదలకు రెడీ
ABN , Publish Date - Oct 16 , 2025 | 04:21 PM
సన్నీ లియోన్ (Sunnyleone) ప్రధాన పాత్రలో అఖిరా డ్రీమ్ క్రియేషన్స్ బ్యానర్ మీద శ్రీదేవి మద్దాలి, రమేష్ మద్దాలి (Ramesh Maddali) నిర్మించిన చిత్రం ‘త్రిముఖ’ (Trimukha).
సన్నీ లియోన్ (Sunnyleone) ప్రధాన పాత్రలో అఖిరా డ్రీమ్ క్రియేషన్స్ బ్యానర్ మీద శ్రీదేవి మద్దాలి, రమేష్ మద్దాలి (Ramesh Maddali) నిర్మించిన చిత్రం ‘త్రిముఖ’ (Trimukha). సన్నీ లియోన్‌తో పాటుగా యోగేష్ కల్లె, అకృతి అగర్వాల్, CID ఆదిత్య శ్రీవాస్తవ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాజేష్ నాయుడు దర్శకత్వంలో ఐదు భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించారు.
ఈ సినిమా కాన్సెప్ట్ చెబుతూ ఈ నెల 18న టీజర్ రిలీజ్ చేయబోతున్నారు. 'దాదాపు 14 కోట్లతో భారీ స్థాయిలో నిర్మించబడిన ఈ ప్రాజెక్ట్ క్వాలిటీ విషయంలో మేకర్స్ ఎక్కడా కాంప్రమైజ్ కాలేదని, విజువల్ వండర్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నామని మేకర్స్ తెలిపారు. అక్టోబర్ 18న టీజర్‌తో పాటుగా, రిలీజ్ డేట్‌ని కూడా ప్రకటించబోతున్నామన్నారు.
‘త్రిముఖ’ జర్నీ మాకెంతో ప్రత్యేకం. ఐదు భాషల్లో సినిమాను నిర్మించడం అనేది మామూలు విషయం కాదు. అక్టోబర్ 18న విడుదలయ్యే టీజర్‌తో మేం ఎలాంటి ప్రపంచాన్ని సృష్టించామో అందరికీ తెలుస్తుంది. డిసెంబర్‌లో గ్రాండ్ థియేట్రికల్ విడుదల కోసం మేం ప్రయత్నాలు చేస్తున్నాం' అని దర్శకుడు చెప్పారు.