Sumathi Satakam: ఫన్నీ, క్యూట్, ఫ్యామిలీ, లవ్ స్టోరీ..

ABN , Publish Date - Aug 28 , 2025 | 03:12 PM

అమర్ దీప్ చౌదరి, సయాలీ జంటగా నటిస్తున్న ‘సుమతీ శతకం’ ప్రత్యేక పోస్టర్ ను వినాయక చవితి సందర్భంగా విడుదల చేశారు 



అమర్ దీప్ చౌదరి, సయాలీ జంటగా విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మిస్తున్న చిత్రం ‘సుమతీ శతకం’.  ఎం. ఎం. నాయుడు దర్శకత్వం వహించారు. టేస్టీ తేజ, మహేష్ విట్టా, జెడివి ప్రసాద్, మిర్చి కిరణ్ ప్రత్యేక పాత్రలు పోషించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన కంటెంట్‌తో ‘సుమతీ శతకం’ ఆడియెన్స్‌లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. హీరో హీరోయిన్ కారెక్టర్స్, పోస్టర్లకు మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే.

Amar.jpg

వినాయక చవితి సందర్భంగా మరో పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో హీరో హీరోయిన్లను చూస్తుంటే ఏదో ఫన్నీ, క్యూట్, ఫ్యామిలీ, లవ్ స్టోరీగా ఈ చిత్రం రాబోతోందని అర్థం అవుతోంది. ఈ చిత్రానికి సుభాష్ ఆనంద్ సంగీతం అందిస్తున్నారు. నహిద్ ముహమ్మద్ ఎడిటర్‌గా, హాలేష్ సినిమాటోగ్రఫర్‌గా పని చేస్తున్నారు. ఈ చిత్రానికి కథను బండారు నాయుడు అందించారు. 

Updated Date - Aug 28 , 2025 | 03:23 PM