Thabitha : సుకుమార్ భార్యకు అరుదైన గౌరవం
ABN , Publish Date - Jul 07 , 2025 | 06:46 PM
ప్రతి పురుషుడి విజయం వెనుక ఓ మహిళ ఉంటుంది అంటారు. కానీ.. ఆ మహిళనే ఆ పురుషుడిని మించిన విజయం సాధిస్తే ఎలా ఉంటుంది! 'పుష్ప' క్రియేటర్ సుకుమార్ సతీమణికి ఇప్పుడు అదే గౌరవం దక్కింది.
తబిత సుకుమార్ (Thabitha Sukumar) ఒకప్పుడు డైరెక్టర్ సుకుమార్ భార్య అనే ట్యాగ్‌తోనే ఫేమస్. కానీ ఇప్పుడు తనకంటూ ఒక యూనిక్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నారు. నిర్మాతగా ఫిల్మ్ ఇండస్ట్రీలో తన మార్క్ చూపిస్తూ అందరి అటెన్షన్‌ను గ్రాబ్ చేస్తున్నారు. ఆమె ప్రొడ్యూస్ చేసిన 'మారుతి నగర్ సుబ్రమణ్యం' (Maruthi Nagar Subramanyam) సినిమా ఆడియన్స్‌ను ఆకట్టుకోవడమే కాక... తబితకు కూడా మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. ఈ సక్సెస్ తర్వాత కొన్ని సినిమాలకు సమర్పకురాలిగా కూడా వ్యవహరిస్తూ ఇండస్ట్రీలో తన గ్రిప్‌ను బలంగా పెంచుకుంటున్నారు. రీసెంట్‌గా తబితకు ఓ స్పెషల్ అచీవ్‌మెంట్ దక్కింది.
నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (North America Telugu Society) నాట్స్ టంపాలో జరిపిన 8వ అమెరికా తెలుగు సంబరాల్లో ఆమె టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు. ఈ గ్రాండ్ ఈవెంట్‌లో తబిత సుకుమార్‌ను స్పెషల్‌గా సన్మానించారు. నిర్మాతగా ఆమె సాధిస్తున్న సక్సెస్, ఇండస్ట్రీలో అందరితో మెయిన్‌టైన్ చేస్తున్న రిలేషన్స్‌కు గుర్తింపుగా ఈ సన్మానం చేశారు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే తబిత, ఈ నాట్స్ ఈవెంట్ గురించి సూపర్ ఎనర్జీతో ఓ పోస్ట్ పెట్టారు.
'మ్యూజిక్ టు మెమరీస్... టంపా నాట్స్‌లో ఫ్యామిలీతో కలిసి ఈ ఈవెంట్ అదిరిపోయింది' అంటూ కొన్ని కలర్ ఫుల్ ఫోటోలను షేర్ చేశారు. ఈ పిక్స్‌లో తబితతో పాటు ఆమె హస్బెండ్ సుకుమార్ (Sukumar), డాటర్ సుకృతి వేణి (Sukriti Veni), కొడుకు సుక్రాంత్ కూడా కనిపిస్తున్నారు. తబిత పోస్ట్ చేసిన ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే సుకుమార్ కూతురు సుకృతి వేణి 'గాంధీ తాత చెట్టు' (Gandhi Tatha Chettu) తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈ సినిమాను శేష సిందూరావ్ నిర్మించారు. ఆ తర్వాత మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి సుకుమార్ రైటింగ్స్ దీనిని విడుదల చేసింది. థియేటర్లలో ఈ యేడాది జనవరి 24న విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. మొత్తానికి సుకుమార్ ఫ్యామిలీ మెంబర్స్ ఇండస్ట్రీలో స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకోవడంతో ఆయన అభిమానులు ఖుషి అవుతున్నారు.