Sukruthi Veni: ఉత్తమ బాలనటిగా సుకుమార్ తనయ
ABN , Publish Date - Aug 02 , 2025 | 06:40 AM
గాంధీ తాత చెట్టు చిత్రంలో నటనకు గాను జాతీయ ఉత్తమ బాలనటిగా మరో నలుగురితో కలసి సంయుక్తంగా అవార్డుకు
‘గాంధీ తాత చెట్టు’ చిత్రంలో నటనకు గాను జాతీయ ఉత్తమ బాలనటిగా మరో నలుగురితో కలసి సంయుక్తంగా అవార్డుకు ఎంపికయ్యారు. సుకృతి వేణి బండ్రెడ్డి. అందరి హృదయాల్ని తాకేలా, మనసుల్ని హత్తుకునేలా ‘గాంధీ తాత చెట్టు’ కథ ఉంటుంది. దర్శకుడు సుకుమార్ కుమార్తె అయిన సుకృతి వేణి బండ్రెడ్డి నటనకు అందరూ ముగ్దులయ్యారు. మొదటి చిత్రంతోనే జాతీయ అవార్డు గెలిచిన సుకృతిని చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రశంసించారు.