O Bhama Ayo Rama: భావోద్వేగాలను ప్రేక్షకులు అనుభూతి చెందుతారు

ABN , Publish Date - Jul 10 , 2025 | 06:08 AM

సుహాస్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఓ భామ అయ్యో రామ’. రామ్‌ గోధల దర్శకత్వంలో హరీశ్‌ నల్ల నిర్మించారు. ఈ శుక్రవారం విడుదలవుతోంది. చిత్రబృందం ఇటీవలే ప్రీ రిలీజ్‌..

సుహాస్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఓ భామ అయ్యో రామ’. రామ్‌ గోధల దర్శకత్వంలో హరీశ్‌ నల్ల నిర్మించారు. ఈ శుక్రవారం విడుదలవుతోంది. చిత్రబృందం ఇటీవలే ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించింది. ముఖ్య అతిథిగా హాజరైన నటుడు మంచు మనోజ్‌ మాట్లాడుతూ ‘ఎలాంటి సినీ వారసత్వం లేకుండా హీరోగా నిలదొక్కుకున్నాడు సుహాస్‌. తమిళంలో విజయ్‌ సేతుపతిలా సుహాస్‌ కూడా గొప్ప నటుడు. ‘ఓ భామ...’ చిత్రం ఘన విజయం అందుకోవాలి’ అని ఆకాంక్షించాడు. సుహాస్‌ మాట్లాడుతూ ‘ఈ సినిమా చూశాక అందరూ మాళవికతో ప్రేమలో పడిపోతారు. తన నటన, హావభావాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంది. నేను మరోసారి బలమైన పాత్రని చేశాను. కథలోని భావోద్వేగాలను ప్రేక్షకులు అనుభూతి చెందుతారు’ అని చెప్పారు. హరీశ్‌ నల్లా మాట్లాడుతూ ‘దర్శకుడు రామ్‌ మంచి టీమ్‌ను సెలెక్ట్‌ చేసుకున్నాడు. ఆయనకు మంచి భవిష్యత్‌ ఉంది. సుహాస్‌ అందరికీ గుర్తుండిపోయే పాత్రలో కనిపిస్తారు’ అన్నారు. రామ్‌ గోధల మాట్లాడుతూ ‘ఆద్యంతం ఆసక్తిని రేకెత్తించే ఓ విభిన్న కథా చిత్రం ఇది. మనుషుల విలువల్ని, వారి మధ్య ఉండే భావోద్వేగాల్ని తెరపై ఎంతో సహజంగా చూపించాం. సుహాస్‌ కెరీర్లో మరో వైవిధ్యమైన చిత్రంగా నిలుస్తుంది’ అని చెప్పారు.

Updated Date - Jul 10 , 2025 | 06:08 AM