Sudigali Sudheer: సుధీర్ చాలా మంచివాడని హీరోగా తీసుకున్నా.. నిర్మాత ఆవేదన
ABN , Publish Date - Dec 02 , 2025 | 06:51 PM
సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer), దివ్యభారతి (Divyabharathi) జంటగా తెరకెక్కిన చిత్రం గోట్ (Goat). మొగళ్ల చంద్రశేఖర్ నిర్మించిన ఈ సినిమా వివాదాల నడుమ నడుస్తున్న విషయం తెల్సిందే.
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer), దివ్యభారతి (Divyabharathi) జంటగా తెరకెక్కిన చిత్రం గోట్ (Goat). మొగళ్ల చంద్రశేఖర్ నిర్మించిన ఈ సినిమా వివాదాల నడుమ నడుస్తున్న విషయం తెల్సిందే. మొదట ఈ సినిమాకు నరేష్ కుప్పిలి దర్శకత్వం వహించాడు. సినిమా అంతా బాగానే వస్తుంది. రిలీజ్ అయిన సాంగ్స్ కూడా చార్ట్ బస్టర్ అయ్యాయి. త్వరలోనే రిలీజ్ అవుతుంది అనుకొనేలోపు బడ్జెట్ సమస్యలు తలెత్తి సినిమా ఆగిపోయింది. దీంతో ఆగిన సినిమాను నిర్మాతనే ఫినిష్ చేసి రిలీజ్ కు సిద్ధం చేశాడు.
ఇప్పటివరకు గోట్ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ రిలీజ్ ఈవెంట్ కి కూడా సుధీర్ రాలేదు. దీంతో అందరూ సినిమాకు హీరో సపోర్ట్ చేయడం లేదు అని మాట్లాడుకుంటున్నారు. ఇక దాని గురించి నిర్మాత ఆవేదన వ్యక్తం చేశాడు. ' సుధీర్ చాలా బాధ్యత కలిగిన వ్యక్తి , చాలా మంచివాడు అనుకోని .. కింద నుంచి పైకి వచ్చాడు కదా అని ఆయనను హీరోగా ఒప్పుకున్నాము.
ఇప్పటివరకు సుధీర్ కి పెట్టలేని బడ్జెట్ ను పెడుతున్నాము. దానికి అతను న్యాయం చేస్తాడు అనుకోని సెలెక్ట్ చేసాం. ఆయన మంచి ఫ్యామిలీ నుంచి కూడా వచ్చాడు. త్వరగా ఆ వివాదాన్ని ముగించుకొని ప్రమోషన్స్ కి వస్తాడు అని అనుకుంటున్నాను. డైరెక్టర్ తో ఆయనకు కొంచెం సమస్యలు ఉన్నాయి. అవన్నీ సెట్ అవ్వడానికి కొద్దిగా టైమ్ పడుతుంది. మీడియా ద్వారా కూడా చెప్తున్నాను. సుధీర్ గారు ఇది మీ మూవీ.. మీరు రావాలి. కచ్చితం ఆయన ముందు ముందు ఈవెంట్స్ కి వస్తారని అనుకుంటున్నాను' అని చెప్పుకొచ్చాడు.