Sudheer Babu: సుధీర్‌బాబు.. ఈసారి గ‌ట్టిగానే డిసైడ్ అయిన‌ట్టున్నాడుగా!

ABN , Publish Date - May 11 , 2025 | 04:36 PM

గ‌త సంవ‌త్స‌రం హ‌రోంహ‌ర‌, మా నాన్న సూప‌ర్ హీరో వంటి రెండు విభిన్న సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన సుధీర్‌బాబు ప్రతిసారి కొత్తదనం కోసం వినూత్నమైన కథలను ఎంచుకుంటూ వస్తున్నారు.

sudheer babu

గ‌త సంవ‌త్స‌రం హ‌రోంహ‌ర‌, మా నాన్న సూప‌ర్ హీరో వంటి రెండు విభిన్న సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన సుధీర్‌బాబు (Sudheer Babu) ప్రతిసారి కొత్తదనం కోసం వినూత్నమైన కథలను ఎంచుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు అదే ధోరణిలో ఈ కొత్త ప్రాజెక్టు సర్వైవల్ థ్రిల్లర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ పాత్ర కోసం మరోసారి సుధీర్ బాబు తన ఫిజిక్ ని మేకోవర్ చేస్తూ, కండలు తిరిగిన మాచో లుక్‌లో మారిపోయారు.

ఆదివారం (మే11) సుధీర్‌బాబు పుట్టిన రోజు సంద‌ర్భంగా తాజాగా ఈ సిన‌మాకు సంబంధించిన అప్డేట్‌ను మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. కంటెంట్ బేస్డ్ సినిమాలు, భారీ స్థాయిలో మాస్ ఎంటర్టైనర్లు రూపొందించడంలో ప్రత్యేకత కలిగిన పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌజ్‌ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) నవదళపతి సుధీర్ బాబు (Sudheer Babu) హీరోగా తమ 51వ ప్రొడక్షన్‌ను అనౌన్స్ చేసింది. ఈ చిత్రానికి RS నాయుడు దర్శకత్వం వహించ‌నుండ‌గా #PMFxSB విశ్వప్రసాద్ (Vishwaprasad TG), కృతి ప్రసాద్ (Krithi Prasad) నిర్మిస్తున్నారు.

sudheer.jpeg

ఈ సంద‌ర్భంగా విడుద‌ల చేసిన అనౌన్స్మెంట్ పోస్టర్ అదిరిపోయింది. ఇందులో సుధీర్ బాబు (Sudheer Babu) షర్ట్ లెస్ గా, సాలిడ్ ఫిజిక్ తో ఇంటెన్స్ లుక్ లో కనిపించారు. మెట్లపై మృతదేహాలు పడిపోతుండగా, ఆయన ఒక చేతిలో ఆయుధాన్ని పట్టుకుని పైకెత్తుతూ కనిపించడం చాలా క్యూరియాసిటీని పెంచేదిలా ఉంది. "A Broken Soul On A Brutal Celebration" అనే ట్యాగ్‌లైన్ సుధీర్ బాబు క్యారెక్టర్ డెప్త్ ని తెలియజేస్తోంది. త్వ‌ర‌లో మిగిలిన విష‌యాలు తెలియ‌నున్నాయి.

Updated Date - May 11 , 2025 | 04:36 PM