Sudheer Babu: ఆ.. నిజాలు ఒప్పుకోవాలి అంటే గట్స్ ఉండాలి
ABN , Publish Date - Nov 03 , 2025 | 02:38 PM
సుధీర్ బాబు కథానాయకుడిగా తెరకెక్కించిన చిత్రం జటాధర ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో నిర్వహించారు.
సుధీర్ బాబు (Sudheer Babu) కథానాయకుడిగా వెంకట్ కల్యాణ్, అభిషేక్ జైస్వాల్ తెరకెక్కించిన చిత్రం జటాధర (Jatadhara). సోనాక్షి సిన్హా (Sonakshi Sinha) హీరోయిన్, ఉమేశ్ కుమా ర్ బన్సల్, శివన్ నారంగ్ నిర్మించారు. ఈ నెల 7న సినిమా విడుదలవుతున్న సందర్భంగా ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సుధీర్ బాబు మాట్లాడుతూ.. సుధీర్ బాబు అంటే ఎవరని నాలో నేను ఎన్నోసార్లు అనుకున్నా..కృష్ణ గారి అల్లుడు.. మహేష్ బాబు గారి బావ అనే మాటలు కామన్‌గా వినిపించే సమాధానాలు. అవన్నీ నేను గర్వంగా ఒప్పుకుంటున్న నిజాలని ఇలా పబ్లిక్ ప్లాట్ ఫామ్ లో నిజాలు ఇప్పుడుకోవాలి అంటే గట్స్ ఉండాలి అని అన్నారు.
కానీ వారి పేరుతో నాకు ఇండస్ట్రీలో అదనంగా ఒక కాఫీ మాత్రమే లభించిందని మిగతా అంతా స్వయంగా కష్టపడుతున్నా అని అన్నారు. ఇక ఈ చిత్రంలో నేను ' దెయ్యాల్ని వేటాడే వ్యక్తిగా కనిపిస్తాను. సినిమా చాలా ఆసక్తికరంగా ఉంటుందని శివుడి నేపథ్యంలో వచ్చే సీక్వెన్స్‌కు గూస్బంప్స్ పక్కా' అని తెలిపారు. నేను పోషించిన పాత్రను తెలుగులో ఇప్పటివరకూ ఎవ్వరూ చేయలేదు. నా సినిమా హిట్ అయితే అది నా కష్టంగా భావిస్తా ఫ్లాప్ అయితే నా ఓటమిగా స్వీకరిస్తా' అని అన్నారు.
'జటాధర' సినిమాలో సుధీర్ బాబు నటన అద్భుతంగా ఉంటుంది' అని శివన్ నారంగ్ చెప్పారు. 'నాకు తెలుగు చిత్ర పరిశ్రమ అంటే చాలా ఇష్టం. ఈ చిత్రం విషయంలో సహకారం అందించిన ప్రతీఒక్కరికీ కృత జ్ఞతలు' అని ప్రేరణ (Prerna Arora) అరోరా పేర్కొన్నారు.