Su From So: నవ్వుల పండగ

ABN , Publish Date - Aug 04 , 2025 | 06:05 AM

కన్నడనాట ఇటీవలె విడుదలై బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకున్న చిత్రం ‘సు ఫ్రమ్‌ సో’. తాజాగా ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది...

కన్నడనాట ఇటీవలె విడుదలై బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకున్న చిత్రం ‘సు ఫ్రమ్‌ సో’. తాజాగా ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ఈనెల 8న మైత్రీ మూవీమేకర్స్‌ విడుదల చేస్తోంది. జేపీ తుమినాడ్‌ కథానాయకుడిగా నటించి దర్శకత్వం వహించారు. షనీల్‌ గౌతమ్‌, సంద్య అరకెరె ప్రధాన పాత్రలు పోషించారు. రాజ్‌.బి.శెట్టి, శశిధర్‌ శెట్టి బరోడా, రవిరాయ్‌ కలస నిర్మించారు. ఆసక్తికరమైన కథ, కథనంతో నిండిన ఈ చిత్రం ప్రేక్షకులకు నవ్వుల పండగను అందింస్తుందని మేకర్స్‌ ధీమా వ్యక్తం చేశారు.

Updated Date - Aug 04 , 2025 | 06:05 AM