Chintakindi Srinivasarao: పరిసరాలే కథా వస్తువులు
ABN , Publish Date - Sep 05 , 2025 | 01:59 AM
ప్రపంచస్థాయి కథలైనా మన పరిసరాల్లోనే ఉంటాయి. అవి మనిషి కేంద్రంగా తిరుగుతుంటాయి. మన చుట్టూ నిత్యం నడయాడుతున్న ఘటనలు, సంఘటనలే నా రచనలకు ప్రేరణగా నిలుస్తాయి’ అని అన్నారు రచయిత చింతకింది..
ప్రపంచస్థాయి కథలైనా మన పరిసరాల్లోనే ఉంటాయి. అవి మనిషి కేంద్రంగా తిరుగుతుంటాయి. మన చుట్టూ నిత్యం నడయాడుతున్న ఘటనలు, సంఘటనలే నా రచనలకు ప్రేరణగా నిలుస్తాయి’ అని అన్నారు రచయిత చింతకింది శ్రీనివాసరావు. ఆయన కథను అందించిన ‘ఘాటి’ సినిమా నేడు విడుదలవుతోంది. అనుష్కశెట్టి, విక్రమ్ ప్రభు జంటగా నటించారు. ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు ‘చిత్రజ్యోతి’తో మాట్లాడుతూ ‘మనిషి కథ చెప్పడం వర్తమాన సాహితీ రంగంలో అత్యంత ఆవశ్యకం. మానవ జీవితంలో సామాజిక స్వభావం తెస్తున్న మార్పులు, తన చుట్టూ జరుగుతున్న పరిణామాలు కథలుగా రావాలి. వలస జాలర్ల జీవితాన్ని అక్షరబద్దం చేసిన ‘మున్నీటి గీతలు’ నవల, ఇప్పుడీ ‘ఘాటీ’ చిత్ర కథ ఆ స్ఫూర్తితోనే రాశాను. ‘మున్నీటి గీతలు’ నవల ‘అరేబియా కడలి’ వెబ్‌సిరీ్‌సగా రూపుదిద్దుకుంది. సాహితీ రంగానికి చెందిన నన్ను ‘ఘాటి’ చిత్రం ద్వారా తెలుగు సినిమా తెరకు పరిచయం చేస్తున్న దర్శకుడు క్రిష్‌కు కృతజ్ఞతలు’ అని అన్నారు.
- చింతకింది శ్రీనివాసరావు