SS Rajamouli: హనుమంతుడిని అవమానించిన రాజమౌళి.. ఏకిపారేస్తున్న హిందూ సంఘాలు

ABN , Publish Date - Nov 16 , 2025 | 03:38 PM

గ్లోబ్ ట్రాటర్ (Globe Trotter) ఈవెంట్ లో దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన విషయం తెల్సిందే. హనుమంతుడిని అవమానించినట్లు రాజమౌళి మాట్లాడడం ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

SS Rajamouli

SS Rajamouli: గ్లోబ్ ట్రాటర్ (Globe Trotter) ఈవెంట్ లో దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన విషయం తెల్సిందే. హనుమంతుడిని అవమానించినట్లు రాజమౌళి మాట్లాడడం ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఎన్నో కోట్లు పెట్టి గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ ను నిర్వహించారు. అంత పెద్ద ఈవెంట్ లో చిన్న చిన్న సమస్యలు రావడం సహజం. టైటిల్ గ్లింప్స్ ఒకసారి కాదు రెండు సార్లు కాదు.. 5 సార్లు మధ్యలో ఆగిపోయింది. వంద అడుగుల ఎల్ ఈడీ తెరకు పవర్ సరిపోకపోవడంతో చిన్న సాంకేతిక సమస్య వచ్చింది. అంత ఖర్చుపెట్టినప్పుడు ఎక్కడ ఈవెంట్ ప్లాప్ అవుతుంది అనుకోని బాధపడడం అనేది సహజం. అలా అని దేవుడిని నిందించడం కరెక్ట్ కాదు అని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు.

అసలేం జరిగింది అంటే.. ఈవెంట్ లో గ్లింప్స్ రావడం లేట్ అవ్వడంతో రాజమౌళి టెన్షన్ పడ్డాడు. వెంటనే మైక్ తీసుకొని.. దేవుడి మీద పెద్ద నమ్మకం లేదు.. నాన్నగారు ఇందాక వచ్చి హనుమాన్ వెనుకాల ఉన్నాడు.. గుండె తట్టి నడిపిస్తాడు అని చెప్పారు. ఇలా అయిన వెంటనే కోపం వచ్చింది ఇదేనా నడిపించేది' అని మాట్లాడాడు . ఈ వ్యాఖ్యలపై హిందూ సంఘాలు భగ్గుమన్నాయి. దేవుళ్లపై నమ్మకం లేని నువ్వు దేవుడి సినిమాలు ఎలా తీస్తున్నావ్. హనుమంతుడిని ఇంతలా అవమానిస్తావా.. తప్పు చేశావ్ జక్కన్న అంటూ ఫైర్ అవుతున్నారు.

అయితే మరికొందరు రాజమౌళి చేసినదానికి వివరణ ఇస్తున్నారు. అన్ని దేవుడే అనుకున్నవారు.. ఏది జరగకపోయినా ఆయననే నిందిస్తారు. ఇక్కడ రాజమౌళి.. నేను నిన్ను నమ్మకపోయినా.. మా నాన్న, భార్య నిన్నే నమ్ముకున్నారు. వారి కోసం కూడా నువ్వు చేయలేదు అని ఆ బాధలో అన్నాడే తప్ప ఇంకేమి లేదని చెప్పుకొస్తున్నారు. ఏదిఏమైనా కూడా జక్కన్న చేసిన వ్యాఖ్యలు మాత్రం తప్పే కాబట్టి ఆయన క్షమాపణలు చెప్పాల్సిందే అని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరి ఈ వివాదంపై రాజమౌళి ఎలా స్పందిస్తాడో చూడాలి.

Updated Date - Nov 16 , 2025 | 03:38 PM