SS Rajamouli: రాముడిగా మహేష్.. కన్ఫర్మ్ చేసిన రాజమౌళి
ABN , Publish Date - Nov 15 , 2025 | 09:50 PM
మహేష్ బాబు(Mahesh Babu) ను చూసి అందరూ నేర్చుకోవాలని రాజమౌళి (Rajamouli) గ్లోబ్ ట్రాటర్ (Globe Trotter) ఈవెంట్ లో చెప్పుకొచ్చాడు. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న చిత్రం వారణాసి (Vaaranaasi).
SS Rajamouli: మహేష్ బాబు(Mahesh Babu) ను చూసి అందరూ నేర్చుకోవాలని రాజమౌళి (Rajamouli) గ్లోబ్ ట్రాటర్ (Globe Trotter) ఈవెంట్ లో చెప్పుకొచ్చాడు. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న చిత్రం వారణాసి (Vaaranaasi). ఈ టైటిల్ ఈవెంట్ లో రాజమౌళి మాట్లాడుతూ.. . నిన్న అర్ధరాత్రి దాటిన తరువాత చాలా జాగ్రత్తలు తీసుకుని మరీ టెస్టింగ్ వీడియోలు స్క్రీన్ చేసి చూసుకునే టైమ్ లో ఎవరో డ్రోన్ తో షూట్ చేసి లీక్ చేసేసారు. దేశం మొత్తం మీద నుంచి బెస్ట్ ఎల్ఇడి లు తెప్పించి ఇంత పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేసాం. దీని కోసం పదుల సంఖ్యలో జనరేటర్లు ఏర్పాటు చేసాం. అయినా ఫలితం లేకపోయింది. అందుకే గ్లింప్స్ లేట్ అయ్యింది.
ఇక ఇప్పుడు మహేష్ క్యారెక్టర్ చెప్తాను. ఆయన సెట్ లో ఫోన్ వాడారు. ఎన్ని గంటలు అయినా కూడా కారులోనే వదిలేసి వస్తారు. అందరూ ఆయనను చూసి నేర్చుకోవాలి. మహేష్ నీలాగే నేను ఉండడానికి ప్రయత్నిస్తాను. ఇందాక మా నాన్న కొన్ని సినిమాలు దేవుడే చేయించుకుంటాడు అని.. నేను దేవుడ్ని నమ్మను. కానీ, నా భార్య రమా హనుమాన్ ని బాగా నమ్ముతుంది. ఈరోజు ఆయన మా సైడ్ ఉంటాడో లేదో చూద్దాం అని ఆగుతున్నాను.
నాకు మొదటి నుంచి రామాయణం, మహాభారతం అంటే చాలా ఇష్టం. మహాభారతం తెరకెక్కించడం నా డ్రీమ్ అని అందరికీ తెలుసు. ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు కూడా రామాయణంలో ముఖ్యమైన ఘట్టాన్ని తీస్తానని అనుకోలేదు. ఈ సినిమా మొదలెట్టేటప్పుడు కూడా రామాయణంలో ముఖ్యమైన ఘట్టం తీస్తున్నానని అస్సలు అనుకోలేదు. కానీ ఒకొక్క డైలాగ్ రాస్తుంటే, ఒక్కో సీన్ రాస్తుంటే నేను నేల మీద నడవడం లేదు.. గాల్లో ఉన్నానని అనిపించింది. ఫస్ట్ టైమ్ మహేష్ కి రాముడి వేషం వేసి, ఫొటో షూట్ చేస్తుంటే నాకే గూస్ బమ్స్ వచ్చాయి.
మహేష్ కృష్ణుడిగా బాగుంటాడు.. కొంటెతనం ఉంటుంది. రాముడి లాంటి ప్రశాంతమైన పాత్రకు మహేష్ సూటవుతాడా లేదా అనుకొంటూనే ఫొటో షూట్ చేశాం. ఆ ఫస్ట్ ఫొటోని నా వాల్ పేపర్ కింద పెట్టుకొని పొరపాటున ఎవరైనా చూసేస్తారా అని భయపడి వెంటనే తీసేశా. ఇప్పటికి 60 రోజులు షూట్ చేశాం. ప్రతీ రోజూ.. ఒక ఛాలెంజ్. ఈ మధ్య షూటింగ్ ఫినిష్ అయ్యింది. మీరనుకున్నదానికన్నా ఎక్కువ పరాక్రమంగా ఉంటాడు' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక రాముడిగా మహేష్ నటిస్తున్నాడు అని కన్ఫర్మ్ చేయడంతో అభిమానులు పిచ్చెక్కిపోతున్నారు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా వస్తుందా అని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.