SS Rajamouli: శేఖర్ నమ్మిన సిద్థాంతానికి కట్టుబడి ఉన్నాడు..
ABN , Publish Date - Jun 16 , 2025 | 08:33 PM
'కుబేర' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో దర్శకుడు శేఖర్ కమ్ములపై పొగడ్తల వర్షం కురిపించారు దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి.
'కుబేర' (Kubera) సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో దర్శకుడు శేఖర్ కమ్ములపై (Shekar kammula) పొగడ్తల వర్షం కురిపించారు దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి (SS rajamouli) . నాగార్జున, ధనుష్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.
రాజమౌళి మాట్లాడుతూ ుూశేఖర్ కమ్ముల చాలా సాఫ్ట్ అండ్ సెన్సిబుల్ పర్సన్. ఆయనను చూసిన వెంటనే మనకి అలానే అనిపిస్తుంది. కానీ ఆయన చాలా దృఢ నిశ్చయం కలిగిన మనిషి. తను నమ్మిన సిద్థాంతానికి ఏది అడ్డు వచ్చినా ఒక్క ఇంచ్ కూడా పక్కకు జరగరు. ఆ క్వాలిటీకి చాలా అడ్మైర్ అవుతాను. శేఖర్ ఆయన నమ్మిన సిద్థాంతాల మీద సినిమాలు తీస్తారు. నేను నమ్మిన సిద్ధాంతాలకి నేను చేసే సినిమాలకు సంబంధం ఉండదు. మేము కంప్లీట్ అపోజిట్ పోల్స్. ఆయన అంటే నాకు అపారమైన గౌరవం. ఆయన ఇండస్ట్రీకి వచ్చి 25 సంవత్సరాల అయిందంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు. ఆయన నాకు జూనియర్ అనుకున్నాను కానీ నాకంటే వన్ ఇయర్ సీనియర్ తను. ఈ 25 సంవత్సరాల్లో అలాగే ఉన్నాడు. తాను నమ్మిన సిద్థాంతాలతోనే ముందుకెళ్తున్నాడు. ఆయన అలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. నాగార్జున గారు, శేఖర్ కమ్ముల, టైటిల్ కుబేర.. టైటిల్ బయటకు రాగానే బాగా అనిపించింది. ధనుష్ కూడా ఇందులో ఉన్నాడని తెలిసి మరింత ఎగ్టైట్ అయ్యాను. ట్రాన్స్ అఫ్ కుబేర రిలీజ్ అయిన తర్వాత మైండ్ బ్లోయింగ్ అనిపించింది. ఒక రిచ్ ప్రపంచంలో నాగర్జున, పేద ప్రపంచంలో ధనుష్ సినిమా కథ గురించి ఏమి చెప్పకుండా ఈ రెండు క్యారెక్టర్స్‌ని చూపించడం చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. శేఖర్ కమ్ముల ట్రైలర్‌లోనే సినిమా ఏంటో చెప్పేస్తారు. కానీ కుబేర విషయానికి వస్తే నాకు ఒక సస్పెన్స్ సినిమా లాగా అనిపిస్తుంది. నాగార్జున గారిని ధనుష్ గారిని ఎలా కలిపిపాడు. వాళ్ళ మధ్య డ్రామా ఏంటి? అనేది చాలా క్యూరియాసిటిగా అనిపిస్తుంది. దీని కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నాను. ట్రైలర్ ఆసక్తిని మరింత పెంచింది. అవుట్‌పుట్ చూస్తే టాప్ క్లాస్‌లో ఉంది అవుట్‌పుట్. దేవిశ్రీ ఇచ్చిన నాది నాది సాంగ్ కుబేర థీమ్ ఇవన్నీ ఫెంటాస్టిక్‌గా ఉన్నాయి’’ అని అన్నారు.