SS Rajamouli: వారణాసి ప్రమోషన్స్.. ఓ ప్లానింగ్.. ఓ పద్దతి.. ఓ విజన్..

ABN , Publish Date - Nov 18 , 2025 | 01:19 PM

ప్రమోషన్స్ అందు రాజమౌళి (Rajamouli) ప్రమోషన్స్ వేరయా.. అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

vaaranaasi

SS Rajamouli: ప్రమోషన్స్ అందు రాజమౌళి (Rajamouli) ప్రమోషన్స్ వేరయా.. అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఒక సినిమాను ప్రజల్లోకి తీసుకెళ్లాలి అంటే, అది రిలీజ్ అయ్యే నెల ముందు బయటకు వస్తే చాలు. హడావిడిగా నాలుగు ప్రెస్ మీట్లు పెట్టి.. 3 ఇంటర్వ్యూలు ఇచ్చి.. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా ఒక స్టార్ హీరోని పిలిచేస్తే చాలా ప్రమోషన్స్ ఫినిష్ అనుకొనే మేకర్స్ ఉన్న టాలీవుడ్ లో.. ప్రమోషన్స్ కూడా ఒక ప్లానింగ్.. ఒక పద్దతి.. ఒక విజన్ ఉన్న డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి. ఆయన సినిమా రిలీజ్ చేయడానికి ఏళ్ళు పట్టొచ్చు. కానీ. ఆ రిలీజ్ వెనుక జక్కన్న పెద్ద యుద్ధమే చేస్తాడు. ఏదైనా పర్ఫెక్ట్ గా రావాలనుకుంటాడు. అది సినిమా అయినా ప్రమోషన్ అయినా.. బాహుబలి దగ్గర నుంచి వారణాసి వరకు అదే ఫాలో అవుతూ వస్తున్నాడు.

సూపర్ స్టార్ మహేష్ బాబు- రాజమౌళి కాంబోలో వస్తున్న చిత్రం వారణాసి. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సాధారణంగా జక్కన్న సినిమా అంటే ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకు తగ్గట్లుగానే ఆయన ప్రమోషన్స్ కూడా చేస్తాడు. సినిమా రిలీజ్ కు ఏడాదిన్నర గ్యాప్ ఉన్నా కూడా ఇప్పటినుంచే ప్రమోషన్స్ ఎవరైనా మొదలుపెడతారా.. అది కేవలం జక్కన్న వలనే అవుతుంది. షూటింగ్ అవ్వలేదు.. వేరే ఏ పనులు అవ్వలేదు.. కానీ, ఒకపక్కహీరో, హీరోయిన్, విలన్ ప్రమోషన్స్ చేయడం స్టార్ట్ చేశారు.

అసలు ఇప్పుడే ప్రమోషన్స్ ఎందుకు.. జక్కన్న స్ట్రాటజీ ఏంటి అంటే.. గ్లోబల్ గా రీచ్ రావాలి. ప్రస్తుతం ఆయన టార్గెట్ అదే. సినిమా ఫినిష్ అయ్యి.. నెల రోజుల్లో ప్రమోషన్స్ పూర్తిచేసి గ్లోబల్ గా రీచ్ తెచ్చుకోలేం .. కాబట్టి ఇప్పటి నుంచే ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తే వచ్చే ఏడాది వరకు మన సినిమా పేరు జనాల నోళ్ళల్లో నానుతూ ఉంటుంది. అప్పటివరకు ఏదో ఒక అప్డేట్ ను ఇస్తూనే ఉండాలి. నేషనల్ గానే కాకుండా ఇంటర్నేషనల్ గా కూడా మన సినిమా గురించి మాట్లాడుకోవాలి. ఎప్పుడెప్పుడు వారణాసి సినిమా రిలీజ్ అవుతుందా అని అందరూ ఎదురుచూడాలి. అందుకే ఇప్పటి నుంచే ప్రమోషన్స్ మొదలుపెట్టాలి అని జక్కన్న ప్లాన్ చేసి.. మహేష్, ప్రియాంక, పృథ్వీరాజ్ లతో ఇంటర్నేషనల్ వేదికపై ఇంటర్వ్యూలు ఇప్పిస్తున్నాడు. అందులోనూ ఇతిహాసాలతో ముడిపడిన సినిమా కాబట్టి.. ఇంకా ఎక్కువ ప్రమోట్ చేయాలి. అలా గ్లోబల్ గా రీచ్ తెచ్చుకోవాలని చూస్తున్నాడు. ఏదిఏమైనా రాజమౌళి స్ట్రాటజీకి మాత్రం హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే అని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు.

Updated Date - Nov 18 , 2025 | 01:33 PM