SSMB29 Event: ఎస్ఎస్ఎంబీ 29 ఈవెంట్.. కార్తికేయ క్లారిటీ

ABN , Publish Date - Nov 06 , 2025 | 10:01 AM

ఇప్పుడు అంత మహేశ్‌బాబు (Mahesh Babu) హీరోగా రాజమౌళి తెరకెక్కిస్తున్న'SSMB29' గురించే చర్చ. ఈ నెలలో సినిమాకు సంబంధించి పెద్ద అప్డేట్ ఇస్తా అని రాజమౌళి ప్రకటించిన విషయం తెలిసిందే

SSMB29

ఇప్పుడు అంత మహేశ్‌బాబు (Mahesh Babu) హీరోగా రాజమౌళి (Rajamouli) తెరకెక్కిస్తున్న'SSMB29' గురించే చర్చ. ఈ నెలలో సినిమాకు సంబంధించి పెద్ద అప్డేట్  ఇస్తా అని  రాజమౌళి (SS Rajamouli)ప్రకటించిన నేపథ్యంలో కొన్ని రోజులుగా నెట్టింట ఈ సినిమా పై  చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే సినిమా టైటిల్ వదులుతార లేక మహేష్ బాబు లుక్ రివీల్ చేస్తారా అని అభిమానులు ఆతురతగా ఎదురు చూస్తున్నారు. అయితే దీని కోసం రాజమౌళి పెద్ద ఈవెంట్ ప్లాన్ చేసారు. ఈ విషయాన్నీ అయన తనయుడు కార్తికేయ అధికారికంగా ప్రకటించారు. రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఈ నెల 15న ఈవెంట్‌ (SSMB 29 Event) నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా ఓ  వీడియోను పోస్టు చేశారు. 

అలాగే ఈ సినిమా ఈవెంట్ ను ‘జియో హాట్‌స్టార్‌’ (Jio Hotstar) ఓటీటీ లో స్ట్రీమింగ్‌ కానుందంటూ వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో తన ట్వీట్‌కు ఓటీటీ  సంస్థ ఖాతాను కార్తికేయ ట్యాగ్‌ చేయడంతో దీనిపై క్లారిటీ వచ్చింది. జియోహాట్‌ స్టార్‌ ఈ వీడియోను పోస్టు చేస్తూ ఇండియాలో SSMB29 ఈవెంట్‌ తమ ఓటీటీలోనే స్ట్రీమింగ్‌ అవుతుందని తెలిపింది.  

Updated Date - Nov 06 , 2025 | 10:09 AM