Sreeleela: ఆమె రాకతో మా ఇంట్లో కొత్త కళ వచ్చింది
ABN, Publish Date - May 03 , 2025 | 05:08 PM
నటి శ్రీలీల (Sreeleela) ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఓ పాప ఫొటో ఎంతగా వైరల్ అయిందో తెలిసిందే. చిన్న పిల్లతో ఉన్న ఫొటో పెట్టి ‘మా కుటుంబంలోకి కొత్త వ్యక్తి వచ్చేసింది
నటి శ్రీలీల (Sreeleela) ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఓ పాప ఫొటో ఎంతగా వైరల్ అయిందో తెలిసిందే. చిన్న పిల్లతో ఉన్న ఫొటో పెట్టి ‘మా కుటుంబంలోకి కొత్త వ్యక్తి వచ్చేసింది’ అని క్యాప్షన్ పెట్టారు. ఇప్పటికే శ్రీలీల ఇద్దరు దివ్యాంగులను దత్తత తీసుకుని వారి ఆలనా పాలనా చూస్తోంది. సోషల్ మీడియాలో మరోపాప ఫొటో చూసేసరికి అంతా మరో పాపను దత్తత తీసుకొందా? లేక ఎవరీ పాప అంటూ సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. అయితే తాజాగా ఆ పాప ఎవరో చెబుతూ శ్రీలీల మరో ఫొటో పోస్ట్ చేశారు. ఆమె తన సోదరి కుమార్తె అని చెప్పారు ‘‘ సోదరి కుమార్తె మా ఇంటికి కొత్త కళ తీసుకొచ్చింది. ముఖ్యంగా పిన్నిలో మరింత జోష్ నింపింది’’ అని పేర్కొన్నారు.
వరుస చిత్రాలతో బిజీగా ఉంది శ్రీలీల. మరో పక్క డాక్టర్ చదువుతోంది. టాలీవుడ్‌లో వరుస సినిమాలతో అలరిస్తోన్న శ్రీలీల బాలీవుడ్‌లోనూ అవకాశం అందుకుంది. కార్తిక్ ఆర్యన్ హీరోగా అనురాగ్ బసు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ ఏడాది దీపావళికి ముందుకు రానుంది. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కిస్తోన్న ‘పెద్ది’లో శ్రీలీల ఓ ప్రత్యేక గీతంలో కనిపించనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.