Sreeleela: బాత్ రూమ్ ఫోటోలు వైరల్.. స్పందించిన శ్రీలీల

ABN , Publish Date - Dec 17 , 2025 | 04:47 PM

టెక్నాలజీ రోజురోజుకూ దిగజారిపోతోంది. ప్రపంచం ఈ టెక్నలాజీతో ఏదేదో సాధిస్తుంటే కొంతమంది మాత్రం కేవలం మార్ఫింగ్ ఫోటోలను, డీప్ ఫేక్ ఫోటోలను క్రియేట్ చేయడానికి వాడుతున్నారు.

Sreeleela

Sreeleela: టెక్నాలజీ రోజురోజుకూ దిగజారిపోతోంది. ప్రపంచం ఈ టెక్నలాజీతో ఏదేదో సాధిస్తుంటే కొంతమంది మాత్రం కేవలం మార్ఫింగ్ ఫోటోలను, డీప్ ఫేక్ ఫోటోలను క్రియేట్ చేయడానికి వాడుతున్నారు. ఈ మధ్యకాలంలో ఏఐ ఫోటోలు ఎంత సంచలనాన్ని సృష్టిస్తున్నాయో అందరికీ తెల్సిందే. ముఖ్యంగా కొందరు.. ఆ ఏఐ టెక్నాలజీని ఉపయోగించి హీరోయిన్ల ఫోటోలను వారికి నచ్చినట్లు మారుస్తున్నారు. దీనివలన ఎంతోమంది హీరోయిన్లు సఫర్ అవుతున్నారు. ఈ మధ్యనే రష్మిక.. ఈ ఏఐ ఫోటోల మీద తన ఆవేదన వ్యక్తం చేసింది. ఎంతో అసభ్యకరంగా హీరోయిన్ల ఫోటోలను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో లైక్స్ కోసం, వ్యూస్ కోసం షేర్ చేస్తున్నారు.

ఇక రష్మిక తరువాత శ్రీలీల కూడా ఇలాంటి ఏఐ జనరేటెడ్ ఫొటోస్ వాడకంపై స్పందించింది. ఈ మధ్యనే ఆమె ఫేస్ తో ఎడిట్ చేసిన ఏఐ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బాత్ రూమ్ లో టవల్ కట్టుకొని అద్దం ముందు సెల్ఫీలు దిగుతున్నట్లు ఉన్నాయి. నిజంగా అందులో ఉన్నది శ్రీలీల కాదు అని చెప్పడం ఆమె వల్ల కూడా కాదేమో. అంత పర్ఫెక్ట్ గా ఉన్నాయి. ఎప్పుడు ఇలాంటి ఫోటోలు షేర్ చేయని శ్రీలీల.. ఇలాంటి ఫోటోలు పెట్టిందేంటి అంటూ చాలామంది ఆమెను ట్రోల్ కూడా చేశారు.

తాజాగా శ్రీలీల.. ఆ ఫోటోలపై స్పందించింది. అవి ఏఐ వాడి ఎడిట్ చేసిన ఫోటోలని స్పష్టం చేసింది. ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయొద్దని నెటిజన్స్ కి విజ్ఞప్తి చేసింది. 'సోషల్ మీడియా వినియోగదారులందరూ ఏఐ-జనరేటెడ్ లాంటి అర్ధంలేని విషయాలను సమర్ధించవద్దని నేను నా చేతులు జోడించి అభ్యర్థిస్తున్నాను. టెక్నాలజీని ఉపయోగించడం, దుర్వినియోగం చేయడం మధ్య తేడా ఉంది. టెక్నాలజీలో పురోగతి జీవితాన్ని సరళీకృతం చేయడానికి ఉద్దేశించబడింది, దానిని క్లిష్టతరం చేయడానికి కాదు అనేదినా అభిప్రాయం.

సినిమా రంగంలో ఉన్న ప్రతి అమ్మాయి.. మరొకరికి ఒక కుమార్తె, మనవరాలు, సోదరి, స్నేహితురాలు లేదా సహోద్యోగిగా ఉంటారు, మేము అందరం సురక్షిత వాతావరణంలో ఉన్నామని నమ్మకంతో ఆనందాన్ని పంచే పరిశ్రమలో భాగం కావాలని కోరుకుంటున్నాము. నా షెడ్యూల్ కారణంగా ఆన్‌లైన్‌లో జరుగుతున్న అనేక విషయాల గురించి నాకు తెలియదు. దీనిని నా దృష్టికి తెచ్చినందుకు నా శ్రేయోభిలాషులకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా ప్రపంచం నాదే.. నేను చిన్న విషయాలను పట్టించుకోను. కానీ, ఇది మాత్రం నన్ను ఎంతో బాధిస్తుంది.

ఇలాంటివే నా తోటి సహోద్యోగులు కూడా ఎదుర్కొంటున్నట్లు నేను చూస్తున్నాను. వారి అందరి తరపున కూడా చేరుతున్నాను. గౌరవంతో నా ప్రేక్షకులపై నమ్మకంతో, దయచేసి మాతో నిలబడమని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మిగతాది అధికారులు చూసుకుంటారు.

Updated Date - Dec 17 , 2025 | 04:47 PM