Sree Vishnu: హరిహర వీరమల్లుతో పాటే సింగిల్

ABN, Publish Date - Mar 21 , 2025 | 05:34 PM

పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' మే 9న విడుదల కాబోతోంది. అదే రోజున అల్లు అరవింద్ ప్రెజెంటర్ గా ఉన్న 'సింగిల్' కూడా రిలీజ్ అవుతోంది.

Sree Vishnu: హరిహర వీరమల్లుతో పాటే సింగిల్

సహజంగా ఓ పెద్ద సినిమా వస్తోందంటే... మీడియం బడ్జెట్ చిత్రాలు దానికి దారి వదిలి ముందుకో తర్వాత వారానికో వెళ్ళిపోతాయి. బట్... శ్రీవిష్ణు (Sree Vishnu) తో మూవీ చేస్తున్న దర్శక నిర్మాతలు మాత్రం తగ్గేదే లే అంటున్నారు. ఏప్రిల్ 28న రావాల్సిన పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' (Hari Hara Veeramallu) మూవీని మే 9కి వాయిదా వేశారు. ఇది మెగా స్టార్ చిరంజీవి (Chiranjeevi)కి బాగా అచ్చివచ్చిన రోజు. ఆయన నటించిన 'జగదేక వీరుడు అతిలోక సుందరి, గ్యాంగ్ లీడర్' చిత్రాలు అదే రోజు విడుదలయ్యాయి. సో... ఆ తేదీ పవన్ కళ్యాణ్‌ (Pawan Kalyan) కూ కలిసి వస్తుందని మెగాభిమానులు భావిస్తున్నారు. ఈ ప్రకటన వచ్చిన కొద్ది రోజులకే శ్రీవిష్ణు నటిస్తున్న 'సింగిల్' (Single) మూవీ కూడా సమ్మర్ స్పెషల్ గా మే నెలలో వస్తుందనే అధికారిక ప్రకటన వెలువడింది. అదే ఇప్పుడది కూడా మే 9నే వస్తోందనేది ఇండస్ట్రీ టాక్.


విశేషం ఏమంటే... 'సింగిల్' మూవీని కార్తీక్ రాజు దర్శకత్వంలో అల్లు అరవింద్ (Allu Aravind) ప్రెజెంట్ చేస్తున్నారు. కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించారు. విద్యా కొప్పినీడి, భానుప్రతాప, రియాజ్ చౌదరి దీని నిర్మాతలు. చూస్తూ చూస్తూ 'హరిహర వీరమల్లు'తో పాటు 'సింగిల్' మూవీని అల్లు అరవింద్ ఎలా రిలీజ్ చేస్తాడనే ప్రశ్న కొందరు వేస్తున్నారు. మరికొందరైతే... 'హరిహర వీరమల్లు' మే 9న కూడా రావడం కష్టం కావచ్చునని అంటున్నారు. అయితే ఈ రూమర్స్ కు చెక్ పెడుతూ 'హరిహర వీరమల్లు' మూవీ డబ్బింగ్ మొదలైందని ఆచిత్ర బృందం తాజాగా ఓ ప్రకటన వెలువరిచింది. సో... 'హరిహర వీరమల్లు' పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ సైతం శరవేగంగానే సాగుతోంది. ఏదేమైనా... ఈ రెండు సినిమాల రిలీజ్ కు సంబంధించి క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు ఓపిక పట్టాల్సిందే.

Also Read: Vijay Devarakonda: రెండు భాగాలుగా కింగ్ డమ్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Mar 22 , 2025 | 09:46 AM