Sree Vishnu: శివయ్య ఇష్యూ.. సింగిల్ వర్డ్‌తో క్లోజ్
ABN , Publish Date - May 05 , 2025 | 11:25 AM
శ్రీవిష్ణు నటించిన ‘సింగిల్’ (Single movie) సినిమాకు ట్రైలర్‌కు మంచి టాక్ వచ్చింది. ఫుల్ ఫన్‌తో ఉన్న ట్రైలర్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచింది. అయితే ఇక్కడ చిన్న వివాదాన్ని కూడా తీసుకొచ్చింది.
శ్రీవిష్ణు (Sree Vishnu) నటించి ‘సింగిల్’ (Single movie) సినిమాకు ట్రైలర్‌కు మంచి టాక్ వచ్చింది. ఫుల్ ఫన్‌తో ఉన్న ట్రైలర్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచింది. అయితే ఇక్కడ చిన్న వివాదాన్ని కూడా తీసుకొచ్చింది. ట్రైలర్‌లో వినిపించిన ‘శివయ్యా’ (Sivayya Issue), ‘మంచు కురిసిపోవడం’ డైలాగులు కాస్త వివాదాస్పదమయ్యాయి. దానిపై శ్రీవిష్ణు నిరీక్షణ లేకుండా స్పందించి క్షమాపణ కూడా చెప్పారు. దాంతో అక్కడితో ఇష్యూ క్లోజ్ అయింది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీవిష్ణు జరిగిన దానిపై వివరణ ఇచ్చారు. ‘శివయ్య వివాదం ముగిసినట్టేనా?’ అన్న ప్రశ్నకు ‘సారీ చెప్పేశాను కదా, దాంతో క్లోజ్ అయిపోయింది’ అంటూ క్లారిటీ ఇచ్చారు.
అది కావాలని చేసింది కాదని, ఎవరైనా హర్ట్ అవుతారంటే అసలు దాని జోలికే వెళ్లనని, ట్రైలర్‌లో ఆ డైలాగ్ ఉంటుందో లేదో తనకే తెలీదని, చివరి క్షణంలో ట్రైలర్‌లో చూశానని అన్నారు. పది ట్రైలర్ కట్స్‌లో రెండు ఫైనల్ చేశారని అందులో ఇది ఒకటని, ఫైనల్‌గా ఏది బయటకు వస్తుందో తెలియకపోవడం వల్ల జరిగిన పొరపాటుని శ్రీవిష్ణు అన్నారు. అందుకే దాన్ని కట్ చేసే అవకాశం లేకుండా పోయిందని అన్నారు. ఈ ఇష్యూ వల్ల అందరి టైమ్ వేస్ట్ అని, అందుకే ‘సారీ’ చెప్పేస్తే సర్దుకుంటుందన్న ఉద్దేశంతో ముందడుగు వేశానని, ఇందులో తప్పు, ఒప్పులు ఎవరివో టైమ్ చెబుతుందని అన్నారు శ్రీవిష్ణు. అయితే అలాంటి ఈగోలకు పోకుండా త్వరగా స్పందించి వివాదాన్ని క్లోజ్ చేసిన విష్ణుని అభిమానులు ప్రశంసిస్తున్నారు. ఈలోగా ఈ ట్రైలర్ జనాల్లోకి వెళ్లిపోయి మంచి మైలేజీ తీసుకొచ్చింది. ఈనెల 9న ‘సింగిల్’ థియేటర్లలోకి వస్తోంది.