Narne Nithiin: ఎట్టకేలకు మొదటి చిత్రానికి మోక్షం

ABN , Publish Date - May 17 , 2025 | 04:42 PM

ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ నటించిన తొలి చిత్రం 'శ్రీశ్రీశ్రీ రాజావారు'. సతీశ్ వేగేశ్న దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ 6న విడుదల కాబోతోంది.

'మ్యాడ్' (MAD) చిత్రంతో తెలుగువారి ముందుకు హీరోగా వచ్చాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) బావమరిది నార్నే నితిన్ (Narne Nithiin). ఆ తర్వాత వచ్చిన 'ఆయ్', ఇటీవల విడుదలైన 'మ్యాడ్ స్క్వేర్' చిత్రం మంచి విజయాన్ని సాధించి, అతన్ని హ్యాట్రిక్ హీరోని చేశాయి. విశేషం ఏమంటే... గత వారం విడుదలైన '#సింగిల్' (#Single) మూవీలోనూ నార్నే నితిన్ గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చాడు. ఆ సినిమా కూడా విజయపథంతో సాగుతోంది. ఈ నేపథ్యంలో అతను నటించిన మొదటి చిత్రం జనం ముందుకు రాబోతోంది. ఉత్తమ చిత్రంగా జాతీయ స్థాయిలో అవార్డును అందుకున్న 'శతమానం భవతి' (Shatamanam Bhavati) దర్శకుడు సతీశ్ వేగేశ్న (Satish Vegesna) రూపొందించిన సినిమా 'శ్రీశ్రీశ్రీ రాజావారు' (Sree Sree Sree Rajavaru). సంహిత హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని చింతపల్లి రామారావు నిర్మించారు.


sss.jpeg.jpgఈ సినిమా గురించి చింతపల్లి రామారావు మాట్లాడుతూ, ''అన్నికమర్షియల్ ఎలిమెంట్స్ తో యూత్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా 'శ్రీశ్రీశ్రీ రాజావారు' చిత్రాన్ని తెరకెక్కించాం. మా చిత్ర కథానాయకుడు నార్నె నితిన్ ఇటీవల మంచి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీస్ తో వరుస విజయాలు అందుకుంటున్నారు. ఈ సినిమా కూడా ఆ వరుసలో నిలుస్తుందనే నమ్మకం ఉంది. ఇది గ్రామీణ నేపథ్యంలో సాగే వెరైటీ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఈ సినిమా నిర్మించే ముందే ఎన్టీఆర్ కు కథను చెప్పాం. ఆయనకు ఎంతో బాగా నచ్చింది. ఎన్టీఆర్ అంచనాల మేరకు దర్శకుడు సతీశ్‌ వేగేశ్న ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీపడకుండా తెరకెక్కించారు. జూన్ 6న ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నాం'' అని అన్నారు. ఈ సినిమాలో రావు రమేష్, నరేష్, రఘు కుంచె, ప్రవీణ్, రచ్చ రవి, సరయు, రమ్య, ప్రియ మాచిరాజు, భద్రం, ఆనంద్, జబర్దస్త్ నాగి తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఇందులోని పాటలను శ్రీమణి రాయగా, కైలాష్ మీనన్ సంగీతం అందించారు.

Also Read: Havish New Movie: వినోద ప్రధానంగా...

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - May 17 , 2025 | 04:48 PM