Sreeleela: ఇది కదా న్యూస్.. శ్రీలీల మరో ఐటం సాంగ్? ఈసారి మరింత గట్టిగా
ABN , Publish Date - May 04 , 2025 | 04:09 PM
శ్రీలీల ఈపేరు తెలుగు నాట తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదురెండు మూడు చిత్రాలతోనే తిరుగులేని గుర్తింపు దక్కించుకుని సౌత్‌లో ఆప్రతిహాతంగా దూసుకు పోతోంది. తాజాగా మరో సినిమాలోనే ఐటం సాంగ్ చేయనున్నట్లు టాలీవుడ్‌లో న్యూస్ చక్కర్లు కొడుతుంది.
శ్రీలీల (Sreeleela) ఈపేరు తెలుగు నాట తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. కేవలం రెండు మూడు చిత్రాలతోనే ప్రపంచ వ్యాప్తంగా తిరుగులేని గుర్తింపు దక్కించుకుని సౌత్‌లో ఆప్రతిహాతంగా దూసుకు పోతోంది. టాలీవుడ్‌లో వరుస పరాజయాలు పలకరించినా అమ్మడి అవకాశాలకు కొదువ లేకుండా పోయింది. ఇటీవలే రాబిన్ హుడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి పతన ఖాతాలో మరో డిజాస్టర్ వేసుకున్న ఈ చిన్నది తాజాగా బాలీవుడ్‌లోనూ అడుగు పెట్టి రెండు చిత్రాలు కూడా చేస్తున్న సంగతి తెలిసిందే.
శ్రీలీల (Sreeleela) ప్రస్తుతం తెలుగులో రవితేజతో మాస్ మహారాజా, అఖిల్‌తో లెనిన్, పవన్ చకల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల్లో నటిస్తోంది. కన్నడలో రెండు చిత్రాలు, తమిళంలో శివ కార్తికేయన్ సరసన పరాశక్తి అనే మూవీ చేస్తోంది. మొత్తంగా చేతిలో అర డజన్‌కు పైగానే సినిమాలతో తనకు పోటీనే లేదన్నట్లుగా అగ్ర స్థానంలో వెలుగొందుతోంది. వీటిలో ఐదు సినిమాలు ఈ సంవత్సరమే ప్రేక్షకుల ముందుకు రానుండడం విశేషం. ఇంకా చెప్పుకోవాలంటే ఈ ఏడాది శ్రీలీల నామ సంవత్సరం కాబోతుంది. నెలకొకటి చొప్పున రానున్న 7 నెలల్లో శ్రీలీల సినిమాలే థియేటర్లలో ఉండనున్నాయి.
అయితే ఇదిలాఉండగా.. ఓ వైపు సినిమాల్లో కథానాయికగా చేస్తూనే పుష్ప ది రూల్ (Pushpa2TheRule) సినిమాలో అల్లు అర్జున్‌తో చేసిన కిస్సిక్ (Kissik) అనే ప్రత్యేక పాట శ్రీలీల (Sreeleela)కి దేశ వ్యాప్తంగా అమ్మడికి సపరేట్ బ్యాన్ బేస్‌ను తీసుకు వచ్చింది. ఈక్రమంలోనే రామ్ చరణ్ (Ram Charan), బుచ్చి బాబు (Buchi Babu Sana) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పెద్ది (Peddi) సినిమాలోనూ శ్రీలీల ప్రత్యేక గీతం చేయనున్నట్లు సినిమా వర్గాల్లో న్యూస్ బాగా చక్కర్లు కొడుతోంది.
ఈమేరకు మేకర్స్ శ్రీలీల (Sreeleela) తో సంప్రదింపులు జరిపినట్లు కూడా తెలుస్తోంది. ఏ విషయమైంది అధికారికంగా తెలియాల్సి ఉంది. అదే నిజమైతే ఫ్యాన్స్‌కు ఈ కొత్త జోడీ కనుల విందు చేయడంతో పాటు ఒకరిని మించి మరొకరు తమ డ్యాన్సులు, స్టెప్పులతో థియేటర్లను బద్దలు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఈ వార్త నిజం కావాలని కోరుకుంటున్నారు. ఈ సినిమాకు ఏ ఆర్ రెహమాన్ (A.R.Rahman) సంగీతం మరో ప్రత్యేక ఆకర్షణ కానుంది.